Belly Fat: వయసు పెరిగే కొద్దీ పొట్ట, నడుముపై కొవ్వు పేరుకుపోవడానికి కారణాలు.. పరిష్కారాలు..
ABN , Publish Date - Jun 16 , 2025 | 10:41 AM
6 Mistakes that store fat in lower body: 30-40 సంవత్సరాల మధ్య వయసు ఉన్నవారిలో ఎక్కువగా బెల్లీ ఫ్యాట్ సమస్య కనిపిస్తుంటుంది. ఆ వయసు వచ్చేసరికే శరీరంలోని పొట్ట, నడుము భాగంలో కొవ్వు పేరుకుపోవడానికి గల కారణాలేంటి? ఈ సమస్యను వదిలించుకోవడమెలా?

Reasons And Solutions For Belly Fat: వయసు పెరిగే కొద్దీ చాలా మంది పురుషులు, స్త్రీలలో నడుము, పొట్టపై కొవ్వు పేరుకుపోవడం ప్రారంభమవుతుంది. ఈ సమస్య ముఖ్యంగా మహిళలను ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. ఈ సమస్యపై చాలామంది పెద్దగా దృష్టి పెట్టరు. దీని కారణంగా 40 సంవత్సరాల వయస్సు వచ్చేసరికి వారు ఊబకాయంతోనే కాకుండా మధుమేహం , అధిక రక్తపోటు, థైరాయిడ్ వంటి ఇతర ఊబకాయ సంబంధిత వ్యాధుల బారిన పడతారు. ఈ పరిస్థితి రావడానికి కారణం మీరు ప్రతిరోజూ చేసే ఈ 6 తప్పులే అంటున్నారు వైద్య నిపుణులు. వీటిని నివారిస్తే30-40 సంవత్సరాల వయసులోనూ నాజూగ్గా ఉండవచ్చని అంటున్నారు.
పెద్ద వయస్సులో.. ముఖ్యంగా 30-40 మధ్య వయస్సులో మహిళల్లో బెల్లీ ఫ్యాట్ సమస్య సర్వసాధారణంగా మారింది. కండరాల చుట్టూ చర్మం కింద, అంతర్గత అవయవాల చుట్టూ కొవ్వు పేరుకుపోవడానికి అనేక రకాల కారణాలున్నాయి. హార్మోన్లలో తేడాలు, జీవనశైలి, ఆహారపు అలవాట్లు, నిద్రలేమి, ఒత్తిడి వంటి అనేక కారణాల వల్ల ఇలా జరుగుతుంది. కొన్ని ఆరోగ్యకరమైన అలవాట్లు పాటించడం ద్వారా బెల్లీ ఫ్యాట్‌ను ఈజీగా తగ్గించవచ్చు.
1. బ్రేక్‌ఫాస్ట్‌ను స్కిప్ చేయడం:
చాలా మంది ఉదయాన్నే అల్పాహారం తీసుకోరు. బ్రేక్‌ఫాస్ట్‌ను స్కిప్ చేసేస్తుంటారు. ఈ అలవాటు వల్ల శరీరంలో శక్తి కొరత ఏర్పడుతుంది. హార్మోన్లపై ప్రత్యక్ష ప్రభావం పడి ఉదయం ఆకలిగా అనిపించదు. ఇలాంటి వారు రాత్రి సమయాల్లో భారీగా ఆహారాన్ని తీసుకుంటారు. అందువల్ల బెల్లీ ఫ్యాట్ సమస్య వచ్చేందుకు ఆస్కారముంది. అందుకే ఉదయం మేల్కొన్న గంట తర్వాత కచ్చితంగా అల్పాహారం తీసుకోండి. ఈ అలవాటు హార్మోన్ల రుగ్మతలను నివారించడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా నిద్రపోయే రెండు నుంచి మూడు గంటల ముందు తినడం ఆపేయండి.
2. రోజంతా స్నాక్స్:
రోజంతా స్నాక్స్ తినడం వల్ల శరీరంలో ఇన్సులిన్ స్థాయి పెరుగుతుంది. ఇది కొవ్వు నిల్వలను ప్రేరేపిస్తుంది. దీని నివారించడానికి రోజుకు 2-3 సార్లు సమతుల్య ఆహారం తీసుకోవడం మంచిది. ప్రతి భోజనంలో 30 గ్రాముల ప్రోటీన్ ఉండేలా చూసుకోవాలి.
3. ప్రోటీన్ కోసం ఇలా చేస్తే:
వెజిటేరియన్లు సాధారణంగా ప్రోటీన్ కోసం పప్పు ధాన్యాలు తింటారు. దీని కారణంగా శరీర కణజాలాల్లో నీరు పేరుకుపోతుంది. తరచూ కడుపు ఉబ్బరం వస్తుంది. కాబట్టి, సోయా, టోఫు, పనీర్, గుడ్లు, లీన్ మాంసం, చేపలను తీసుకుంటూ ఉండాలి. తద్వారా ఫైబర్, కొవ్వు పరిమాణం సమతుల్యంగా ఉంటాయి.
4. బ్రేక్‌ఫాస్ట్‌లో హై కార్బ్ ఫుడ్‌లు:
బ్రేక్‌ఫాస్ట్‌లో పోహా, బ్రెడ్, ఇడ్లీ, చాయ్-బిస్కెట్ వంటి హై కార్బ్ ఫుడ్‌లు తీసుకోవడం వల్ల బ్లడ్ షుగర్ స్థాయి పెరుగుతుంది, తద్వారా బెల్లీ ఫ్యాట్ నిల్వలు పెరుగుతాయి. దీని నివారించడానికి బ్రేక్‌ఫాస్ట్‌లో ప్రోటీన్ రిచ్ ఫుడ్‌లు తీసుకోవడం మంచిది.
5. కార్డియో వ్యాయామాలు:
కేవలం కార్డియో వ్యాయామాలు చేయడం వల్ల కొన్నిసార్లు కార్టిసోల్ హార్మోన్ స్థాయి పెరుగుతుంది. ఇది బెల్లీ ఫ్యాట్ నిల్వలను ప్రేరేపిస్తుంది. ముఖ్యంగా ప్రీమెనోపాజ్‌లో కార్డియో వ్యాయామం మాత్రమే కార్టిసాల్‌ను పెంచుతుంది. ఇలా జరగకూడదంటే కార్డియోతో పాటు స్ట్రెంగ్త్ ట్రైనింగ్, వాకింగ్ వంటి వ్యాయామాలను కూడా చేయడం మంచిది.
6. నిద్రలేమి:
7-8 గంటల నిద్ర లేకపోవడం వల్ల శరీరంలో షుగర్ క్రేవింగ్ పెరుగుతుంది. ఫ్యాట్ నిల్వలు అధికమై కండరాలు బలహీనపడతాయి. అందుకే ప్రతిరోజూ తప్పనిసరిగా 7-8 గంటల నిద్ర పోవడం మంచిది.
పెద్ద వయస్సులో బెల్లీ ఫ్యాట్‌ను తగ్గించుకోవడానికి సమతుల్యమైన ఆహారం, వ్యాయామం, సరైన నిద్ర, ఒత్తిడి నిర్వహణ కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం అవసరం. ఆరోగ్యకర అలవాట్లను అనుసరిస్తే బెల్లీ ఫ్యాట్‌ను ఈజీగా తగ్గించవచ్చు.
ఇవి కూడా చదవండి:
అపాన వాయువుకు వేగంగా చెక్ పెట్టే పరిష్కారాలు
హైబీపీతో కంటి సమస్యలు.. వైద్యుల సలహా ఏంటంటే..