Indian Dairy Foods : క్యాన్సర్ రిస్క్ తగ్గించే పాల పదార్థాలు
ABN , Publish Date - Sep 05 , 2025 | 03:45 PM
ప్రపంచ వ్యాప్తంగా సంభవిస్తోన్న మరణాలకు రెండవ ప్రధాన కారణం క్యాన్సర్. అయితే, ఈ క్యాన్సర్ ప్రమాదాన్ని మనం తినే సాధారణ ఆహారం ద్వారానే తగ్గించుకునే అవకాశం ఉందని మీకు తెలుసా?
ఇంటర్నెట్ డెస్క్ : ప్రపంచ వ్యాప్తంగా సంభవిస్తోన్న మరణాలకు రెండవ ప్రధాన కారణం క్యాన్సర్. దీనిలో ఊపిరితిత్తుల క్యాన్సర్ వల్ల వచ్చే మరణాలు అధికంగా ఉన్నాయి. 2022 నివేదికల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 9.7 మిలియన్ల మరణాలకు క్యాన్సర్ కారణమైంది. అయితే, ఈ క్యాన్సర్ ప్రమాదాన్ని మనం తినే సాధారణ ఆహారం ద్వారానే తగ్గించుకునే అవకాశం ఉందని మీకు తెలుసా?
పండ్లు, కూరగాయలు, వీటితోపాటు మరికొన్ని ఆహారాలకు క్యాన్సర్ ప్రమాదాల్ని తగ్గించగలిగే శక్తి ఉంది. వీటిలో పాల ఉత్పత్తులు కీలకమైనవి. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలతో పాటు, సాంప్రదాయ పాల పదార్థాలను ఆహారంలో చేర్చడం వల్ల కొన్ని క్యాన్సర్ల ప్రమాదాన్ని అధిగమించొచ్చు. భారతీయులు అధికంగా వాడే ఆ మిల్క్ ప్రొడక్ట్స్ ఏంటో చూద్దాం.
1. పెరుగు :
పెరుగులో ప్రోబయోటిక్స్ పుష్కలంగా ఉంటాయి. ఇందులో మంచి బ్యాక్టీరియా ఉంటుంది. ఇది ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఫలితంగా ప్రేగులు ఆరోగ్యకరంగా ఉంటాయి. మెరుగైన రోగనిరోధక శక్తిని పెరుగు కల్గిస్తుంది. జీర్ణక్రియను చక్కబరుస్తుంది. పెద్దప్రేగు క్యాన్సర్ వంటి కొన్ని క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గించడంలో పెరుగు ముఖ్య పాత్ర పోషిస్తుంది.
2. మజ్జిగ:
మజ్జిగ మన భారతీయ ఇళ్లలో అత్యంత ప్రధానమైనది. ఇందులో కొవ్వు తక్కువగా ఉంటుంది. మజ్జిగలో ప్రోబయోటిక్స్, కాల్షియం, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. మజ్జిగలో జీర్ణక్రియకు సహాయపడే లక్షణాలున్నాయి. ఇది కడుపు మంటను తగ్గిస్తుంది. క్యాన్సర్ కలిగించే కారకాల నుంచి శరీరాన్ని రక్షిస్తుంది.
3. పనీర్ :
పనీర్ అనేది కాల్షియం, సెలీనియంతో కూడిన ప్రోటీన్-రిచ్ డైరీ ఫుడ్. సెలీనియం యాంటీఆక్సిడెంట్ లక్షణాలకు ప్రసిద్ధి. ఇది కణాలను ఆక్సీకరణ నష్టం నుండి రక్షిస్తుంది. ఇది క్యాన్సర్ నివారణలో చాలా సహాయకారి.
4. నెయ్యి, వెన్న :
మితంగా తీసుకుంటే, నెయ్యి మీకు సంయోగ లినోలెయిక్ ఆమ్లం (CLA) ఇస్తుంది. ఇది క్యాన్సర్ నిరోధక లక్షణాలను కలిగి ఉందని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఇది శరీరంలోని పోషకాల్ని మెరుగుపరుస్తుంది. తద్వారా శరీరం క్యాన్సర్-రక్షిత విటమిన్లు, ఖనిజాలను ఎక్కువగా ఉపయోగించుకోవడంలో సహాయపడుతుంది.
5. పాలు:
పాలలో కాల్షియం, విటమిన్ డి సహజంగా ఉంటుంది. ఈ రెండూ ఎముకల ఆరోగ్యానికి, క్యాన్సర్ నివారణకు చాలా ముఖ్యం. కొలొరెక్టల్ క్యాన్సర్ నిర్మూలనకు ఎంతో ఉపయుక్తం. ఆవు పాలను మితంగా తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరగడంతోపాటు, మొత్తం ఆరోగ్యాన్ని పరిరక్షించడంలో ఎంతో దోహదం చేస్తుంది.

ఈ వార్తలు కూడా చదవండి
జగన్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో అమరావతి నష్టపోయింది: పీవీఎన్ మాధవ్
డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఆశయాలు స్ఫూర్తి: సీఎం చంద్రబాబు
Read Latest Andhra Pradesh News and National News