Share News

Health: వరుసగా 30 రోజుల పాటు దానిమ్మ కాయ తింటే.. లాభమా? నష్టమా?

ABN , Publish Date - Nov 09 , 2025 | 03:48 PM

దానిమ్మ కాయ తినడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. అయితే ప్రతి రోజు.. దానిమ్మ కాయ.. నెలరోజుల పాటు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుందా? నష్టం జరుగుతుందా? అంటే..

Health: వరుసగా 30 రోజుల పాటు దానిమ్మ కాయ తింటే.. లాభమా? నష్టమా?

నెల రోజుల పాటు.. ప్రతి రోజు ఆపకుండా దానిమ్మ కాయ తినడం వల్ల అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. అలా చేయడం వల్ల కలిగే లాభాలను వారు వివరిస్తున్నారు. అలా చేస్తే మెరిసే చర్మం సొంతమవుతుంది. గుండె సమస్యలు దూరమవుతాయి. జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది.


గుండె బలోపేతం..

దానిమ్మ పండ్లు తీసుకోవడం వల్ల గుండె పని తీరు మెరుగుపడుతుంది. అంతేకాదు ఈ గుండె ఉత్తేజితమవుతుంది. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ (ఎన్ఐహెచ్) నివేదిక ప్రకారం.. ఎనిమిది వారాల పాటు రోజూ దానిమ్మ రసం తాగడం వల్ల హిమోడయాలసిస్ చేయించుకునే వారిలో రక్తపోటుతోపాటు ట్రైగ్లిజరైడ్ స్థాయిలు తగ్గుతాయని చెబుతుంది. అంతేకాదు.. ఆక్సీకరణ ఒత్తిడి, వాపును తగ్గించడంతోపాటు మంచి హెచ్‌డీఎల్ కొలెస్ట్రాల్‌ను మెరుగు పరుస్తుంది.


చర్మం మెరుస్తుంది..

ప్రతి రోజు దానిమ్మ పండు రసం తీసుకోవడం వల్ల చర్మం మెరుస్తుందని ప్లేసిబో నియంత్రిత- 2022 అధ్యయం వెల్లడిస్తోంది. ఈ రసం తాగడం వల్ల చర్మంపై ముడతల తీవ్రత తగ్గుతుంది. చర్మ సమతుల్యతను కాపాడుతుంది.


శరీరంలో మంట..

శరీరంలో వివిధ అనారోగ్య సమస్యల వల్ల కలిగే మంటను నిరోధిస్తుంది. హెల్త్ లైన్ నివేదిక ప్రకారం.. దానిమ్మలోని సమ్మేళనాలు.. వాపుతో పోరాడే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి.


మెదుడు చురుగ్గా..

దానిమ్మ కాయను తీసుకోవడం వల్ల జ్ఞాపక శక్తి మెరుగు పడి.. చురుకుగా పని చేస్తోంది. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ చెప్పిన మరో అధ్యయనంతో ఏడాది పాటు ప్రతి రోజూ 230 ఎంఎల్ దానిమ్మ రసం తాగిన వ్యక్తుల్లో జ్ఞాపక శక్తి అధికంగా పెరిగిందని స్పష్టం చేసింది. అంటే ఏదైనా గుర్తించుకోగల సామర్థ్యాన్ని పెంచుకున్నారని తెలింది.


మనస్సు ఉల్లాసం..

దానిమ్మ పండు తీసుకోవడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. దీనిలో ప్రీ బయోటిక్స్ ఉంటాయి. పేగులో మంచి బ్యాక్టీరియా ఉంటుంది. ఇది పేగుల్లో మంచి బ్యాక్టీరియాను పెంచుతాయి. ఇది జీర్ణక్రియ, పోషకాల శోషణను మెరుగుపరుస్తుంది.


రక్తంలో షుగర్‌..

రక్తంలో చక్కెర స్థాయిలను బ్యాలెన్సింగ్‌గా ఉంచుతాయి. అయితే రోజు దానిమ్మ కాయ తీసుకున్నా.. షుగర్ నియంత్రణ కోసం మందులు వేసుకోవాల్సి ఉంటుంది.


రక్తపోటు..

రక్తపోటు వంటి దీర్ఘకాలిక వ్యాధులను సైతం నియంత్రిస్తుంది. అంతేకాదు.. ఈ పండును క్రమం తప్పకుండా తీసుకుంటే.. అధిక రక్తపోటు సమస్యను నయం చేయవచ్చని ఇప్పటికే రుజువు అయింది. క్యాన్సర్ వంటి వ్యాధులను సైతం నివారిస్తోంది. మగవారిలో స్పెర్మ్ నాణ్యత మెరుగు పరుస్తుంది.


రోగనిరోధక శక్తి..

దానిమ్మ కాయంలో విటమిన సి ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఈ పండులో ఫోలేట్, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ మీ శరీరం ఇన్ఫెక్షన్లతో పోరాడటంతోపాటు వేగంగా కోలుకోవడానికి సహాయపడుతుంది. ఈ దానిమ్మలోని యాంటీ మైక్రోబయల్ సమ్మేళనాలు అనారోగ్యాలకు కారణమయ్యే హానికరమైన సూక్ష్మజీవుల నుంచి రక్షిస్తాయి. క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరం ఆరోగ్యపరంగా బలోపేతం అవుతుంది.


మూత్రపిండాల పనితీరు..

దానిమ్మ తీసుకోవడం వల్ల మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా నిరోధించడంలో సహాయపడుతుంది. ఈ రాళ్లు ఏర్పడటానికి దారి తీసే పరిస్థితులను నివారిస్తుంది. అంటే.. ఈ రాళ్లకు కారణమయ్యే ఆక్సలేట్లు, కాల్షియం, పాస్పేట్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. అంటే.. ఈ దానిమ్మకాయ శక్తివంతమైన డీటాక్స్ పండుగా పని చేస్తుంది. శరీరంలోని విషాన్ని సమర్థవంతంగా బయటకు పంపడమే కాకుండా.. మూత్ర వ్యవస్థ సజావుగా పని చేయడానికి సహాయపడుతుంది.


బరువు తగ్గడానికి..

అధిక బరువుతోపాటు ఊబకాయం ఉన్న వారు ఇలా దానిమ్మ కాయ తినడం వల్ల అద్భుతమైన ఫలితాన్ని అందుకుంటారు. శరీర బరువు, రక్తంలో గ్లూకోజ్, ఇన్సులిన్, ట్రైగ్లిజరైడ్స్, కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గించడంలో సహాయపడుతుందని ఎన్ఐహెచ్ అధ్యయనంలో వెల్లడైంది. ఇది చెడు, మంచి కొలెస్ట్రాల్ నిష్పత్తిని మెరుగుపరిచింది.

దానిమ్మ పండులో యాంటీ ఇన్లఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్‌గా కూడా పనిచేస్తుంది. అంటే ఇది కేలరీలు తగ్గించడం మాత్రమే కాకుండా.. జీవక్రియను కూడా మెరుగుపరుస్తుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు నుంచి ప్రతిరోజూ ఒక దానిమ్మ కాయను ఆహారంలో చేర్చుకోవాలి.

ఈ వార్తలు కూా చదవండి..

చిన్న ముక్క తింటే.. ఈ వ్యాధులు దూరం

రొయ్యలు ఇలా తింటే డేంజర్.. ఈ విషయం మీకు తెలుసా?

పురుషుల్లో టెస్టోస్టెరాన్ స్థాయిలు పెరగాలంటే..

For More Health News And Telugu News

Updated Date - Nov 09 , 2025 | 05:53 PM