Health Benefits: చిన్న ముక్క తింటే.. ఈ వ్యాధులు దూరం
ABN , Publish Date - Nov 08 , 2025 | 03:12 PM
శీతాకాలం ప్రారంభమైంది. సీజనల్ వ్యాధులు చుట్టుముడతాయి. ఈ నేపథ్యంలో వాటి నుంచి రక్షణ కోసం వ్యాధి నిరోధకతను ప్రతి ఒక్కరు పెంచుకోవాలి. అందుకోసం ఒకే ఒక్క సింపుల్ చిట్కా పాటిస్తే చాలు. ఏ అనారోగ్య సమస్య మనను చేరదు.
వర్షకాలం వెళ్లిపోయింది. చలికాలం వచ్చేసింది. ఈ కాలంలో సైతం సీజనల్ వ్యాధులు ప్రతి ఒక్కరిని వెంటాడతాయి. అంటే జలుబు, దగ్గు, గొంతు నొప్పులు ఎప్పుడో అప్పుడు ఇబ్బంది పెడతాయి. ఈ నేపథ్యంలో వాటిని ఎదుర్కొనేందుకు రోగ నిరోధక శక్తి చాలా అవసరం. ఆ క్రమంలో అల్లం మురబ్బా దివ్య ఔషధంలా పని చేస్తోంది. ఇది తినడానికి చాక్లెట్‌లాగా ఉంటుంది. కానీ అద్భుతంగా పని చేస్తుంది. ఇది తిన్న కొద్ది సేపటికే మంచి ఫలితాన్ని సైతం ఇస్తుంది.
అల్లం మురబ్బాను బెల్లంతోపాటు అల్లం మిశ్రమంతో తయారు చేస్తారు. అంటే.. అల్లంలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది రోగ నిరోధక శక్తిని సైతం పెంచుతుంది. అలాగే ఇది యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలను కలిగి ఉంటుంది. దీనిని తింటే వెంటనే జలుబు, దగ్గు, గొంతు నొప్పి తదితర సమస్యలు వెంటనే తగ్గిపోతాయి. అంతే కాకుండా.. పరగడపున ఖాళీ కడుపుతో ఒక చిన్న అల్లం మురబ్బా ముక్క తీసుకుంటే.. ఎటువంటి జీర్ణ సమస్యలు ఉన్నా ఇట్టే మాయమైపోతాయని ఆయుర్వేదం సైతం చెబుతుంది. ఆ ప్రభావం నాలుగు రెట్లు అధికంగా కనిపిస్తుందని వెల్లడిస్తుంది.
షుగర్‌తో ఇబ్బంది పడే వారు..
షుగర్ సమస్యతో ఇబ్బంది పడే వారు. చక్కెరతో తయారు చేసిన అల్లం మురబ్బా కాకుండా.. బెల్లంతో చేసిన వాటిని తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ సమస్య ఉన్న వారు.. అల్లం మురబ్బాను మితంగా తీసుకోవాలని చెబుతున్నారు.
ప్రయోజనాలు..
గర్భిణుల్లో వాంతులు, వికారం వంటి సమస్యలను తగ్గిస్తుంది.
పిల్లల్లో పైత్యం, కఫం వంటి రుగ్మతలను నివారిస్తుంది.
బెల్లంలో ఐరన్ ఉంటుంది. ఇది రక్తాన్ని శుద్ధి చేసి జీవ క్రియను క్రమబద్దీకరిస్తుంది.
మహిళల్లో గర్భాశయ సమస్యల నివారణకు సహకరిస్తుంది.
చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది.
కీళ్ల నొప్పులను తగ్గిస్తుంది. అంటే.. అర్థరైటిస్ నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తుందని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.
చర్మానికి సైతం మేలు చేస్తుంది.
ఈ వార్తలు కూడా చదవండి..
రొయ్యలు ఇలా తింటే డేంజర్.. ఈ విషయం మీకు తెలుసా?
పురుషుల్లో టెస్టోస్టెరాన్ స్థాయిలు పెరగాలంటే..
For More Health News And Telugu News