Share News

Health: పురుషుల్లో టెస్టోస్టెరాన్ స్థాయిలు పెరగాలంటే..

ABN , Publish Date - Nov 07 , 2025 | 02:54 PM

మెంతులు చిన్నగానే ఉంటాయి. కానీ వాటి వల్ల కలిగే అనేక ఆరోగ్య ప్రయోజనాలు మాత్రం చాలానే ఉన్నాయి. వీటి వల్ల పురుషులతోపాటు మహిళలకు చాలా లాభాలున్నాయి.

Health: పురుషుల్లో టెస్టోస్టెరాన్ స్థాయిలు పెరగాలంటే..

ప్రతి రోజూ మెంతులు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. వీటిలో సపోనిన్లు, ఫైటోఈస్ట్రోజెన్ తదితర సహజ సమ్మేళనాలు ఉంటాయి. ఇవి ముఖ్యంగా పురుషుల్లో టెస్టోస్టెరాన్ స్థాయిలను పెంచుతుంది. అంటే.. పురుషుల శక్తి, హార్మోన్ల అసమతుల్యతను పెంచడంలో సహాయపడతాయి. వీటిని తిన్న వెంటనే ప్రభావం కనిపించక పోయినా.. నిరంతరం వినియోగించడం వల్ల శరీరంలో బలాన్ని పెంచుతుంది.

fenugreek-seeds.jpg


మహిళలకు సైతం అనేక ప్రయోజనాలు..

మహిళలకు పీసీఓఎస్ (PCOS) వంటి హార్మోన్ల సమస్యలను నియంత్రించడంలో మెంతులు ప్రముఖ పాత్ర పోషిస్తాయి. ఇది ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగు పరుస్తుంది. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. ఇది రుతుస్రావం సమయంలో హార్మోన్ల మార్పులను సమతుల్యం చేస్తుంది. అదే విధంగా మానసిక స్థిరత్వాన్ని ఇస్తుంది. బాలింతలలో పాల ఉత్పత్తిని పెంచడంలో మెంతులు సహాయపడతాయి.


షుగర్ కంట్రోల్‌లో..

షుగర్‌ని నియంత్రించడంలో మెంతులు కీలక పాత్ర పోషిస్తాయి. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. సహజంగా ఇన్సులిన్‌ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. గట్ హార్మోన్ GLP -1ను పెంచడం ద్వారా రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయ పడతాయి.

నీటిలో కరిగే ఫైబర్‌తో ఇవి నిండి ఉంటాయి. నీటిలో నానాబెట్టినప్పుడు అవి జెల్‌గా మారుతుంది. ఈ జెల్ జీర్ణక్రియను నెమ్మదింప చేస్తుంది. దాంతో ఎక్కువ సేపు ఆకలి అనిపించదు. ఇది మనం తినే ఆహారాన్ని తగ్గిస్తుంది. దీంతో మన బరువును నియంత్రణలో ఉంచుతుంది.


ఇంకా మరికొన్ని ప్రయోజనాలు..

  • మెంతులు కాలేయానికి హాని కలిగించవు. ఇవి శరీరంలో ద్రవ సమతుల్యతను కాపాడుతుంది. జీర్ణవ్యవస్థను శుభ్రంగా ఉంచుతుంది.

  • బరువు తగ్గాలనుకునే వారు.. ఒక చెంచా మెంతి గింజలు రాత్రంతా నీటిలో నానబెట్టి.. మరుసటి రోజు ఉదయం ఆ నీటిని తాగాలి. ఇది శరీరంలోని విష పదార్థాలను తొలగించడంతోపాటు కొవ్వును సైతం కరిగిస్తుంది.

  • నానబెట్టిన మెంతి గింజలు లేదా మొలకెత్తిన మెంతి గింజలు ప్రతి రోజూ తీసుకోవడం వల్ల శరీరంలో శక్తి పెరుగుతుంది.

  • చర్మం మెరుస్తుంది.

  • జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.

  • ఇది చిన్న విత్తనమే అయినప్పటికీ.. ఈ గింజ శరీరానికి సంపూర్ణ ఆరోగ్యాన్ని అందిస్తుంది.

గమనిక: ఈ వ్యాసం నివేదికలతోపాటు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమచారం ఆధారంగా రూపొందించ బడింది. ఏబీఎన్ ఆంధ్రజ్యోతికి దీనికి ఎటువంటి సంబంధం లేదు. దీనికి ఈ సంస్థ ఏ బాధ్యత వహించదు.


ఇవి కూడా చదవండి

మార్కెట్‌లో ఫేక్ బంగాళాదుంపలు.. ఇలా గుర్తించండి..

అది మీ కుమారుడి తప్పదం కాదు.. ఎయిరిండియా దుర్ఘటనపై సుప్రీంకోర్టు

For More Health News And Telugu News

Updated Date - Nov 07 , 2025 | 03:04 PM