Best Foods In Winter: చలికాలంలో ఇవి తింటే మంచి ఆరోగ్యం మీ సొంతం
ABN , Publish Date - Dec 22 , 2025 | 02:10 PM
చలికాలం వచ్చిందంటే చాలు వాతావరణం చల్లగా ఉండటం వల్ల మన శరీరానికి వెచ్చదనాన్నిచ్చే, రోగనిరోధక శక్తిని పెంచే ఆహారం తీసుకోవడం ఎంతో ముఖ్యం అని వైద్యులు సూచిస్తుంటారు.
చలికాంలో చాలా మంది గోదుమ రొట్టె తింటుంటారు.. కానీ గోధుమల కంటే జొన్నలు, సజ్జ రొట్టెలు చలికాలంలో ఆరోగ్యానికి చాలా మంచివి. ఇవి శరీర ఉష్ణోగ్రతను సమతుల్యంగా ఉంచుతాయి.
సిట్రస్ పండ్లు తినడం వల్ల మంచి ఆరోగ్యాన్ని పొందుతారు. ముఖ్యంగా ఈ సీజన్ లో నారింజ, బత్తాయి, కివి పండ్లు ఎక్కువగా మార్కెట్ లో దొరుకుతాయి. వీటిలో విటమిన్ - సి పుష్కలంగా ఉంటుంది.
అల్లం-వెల్లుల్లి వంటలో వాడటం వల్ల ఇందులో ఉండే యాంటీ బాక్టీరియల్ గుణాల్ ఎలాంటి ఇన్ఫెక్షన్లు రాకుండా కాపాడుతాయి.
శీతాకాలంలో రాత్రి పడుకునే ముందు పసుపు వేసిన పాలు తాగడం వల్ల శరీరానికి వెచ్చదనంతో పాటు రోగనిరోధక శక్తి బాగా పెరుగుతుంది.
డ్రైఫ్రూట్స్-నట్స్ అంటే బాదం, వాల్ నట్స్, వేరు శనిగలు, ఖర్జూరం తీంటే శరీరంలో వేడి పుడుతుంది. ఈ ఫుడ్స్ మంచి బలాన్ని ఇస్తాయి.
నువ్వుల లడ్డూలు, నువ్వుల పొడి తీనడం వల్ల శరీరానికి కాల్షియం అందుతుంది. ఎప్పుడూ శరీరం వెచ్చగా ఉంటుంది.
చలికాలంలో పరిమితంగా నెయ్యి తీసుకోవడం వల్ల చర్మం పొడిబారకుండా మరి పోషణనిస్తుంది.
ఈ సీజన్ లో పాలకూర, తోటకూర వంటి ఆకుకూరలు తీనడం ఎంతో మంచిది. ఇందులో ఐరన్ పుష్కలంగా ఉంటుంది.. ఇది మిమ్మల్ని వెచ్చగా ఉండేలా చేస్తుంది.
క్యారెట్, బీట్‌రూట్. స్వీట్ పొటాలో(చిలకడదుంప) వంటివి ఈ సీజన్ లో విరివిగా లభిస్తాయి. ఈ దుంపల్లో మంచి పోషకాలు దాగిఉన్నాయి.
Also Read:
న్యూ ఇయర్ పార్టీ.. ఇండియాలో బెస్ట్ బీచ్ డెస్టినేషన్స్ ఏవో తెలుసా?
కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు శరీరంలో కనిపించే సంకేతాలు ఇవే.!
for More Health News and Telugu News