Every Day Eat Two Bananas Only: రోజుకు రెండు అరటి పండ్లు తింటే.. మీరు..
ABN , Publish Date - Oct 10 , 2025 | 04:47 PM
అనేక అనారోగ్య సమస్యలను దూరం చేసే మహత్యం ఒక్క అరటి పండులో ఉందంటే అంత నమ్మశక్యంగా లేదు కదూ. కానీ మనిషికి చేటు చేసే అనారోగ్యాన్ని పారద్రోలే శక్తి మాత్రం అరటి పండులో ఉందంటే మీరు నమ్మగలరా?..
శరీరానికి తక్షణమే శక్తిని ఇచ్చే ఆహార పదార్థాల సంఖ్య పరిమితంగా మనకు అందుబాటులో ఉన్నాయి. వాటిలో విరివిగా దొరకేది అరటి పండు. దీనిలో అనేక రకాల పోషకాలు ఉంటాయి. ప్రతి రోజూ రెండు అరటి పండ్లు తినడం వల్ల.. అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. ప్రపంచంలోనే అత్యధికంగా వినియోగించే పండు.. ఈ అరటి పండు. వీటిలో భారీగా విటమిన్లు, ఖనిజాలు ఉన్నాయి. ఇది సులభంగా.. అతి త్వరగా తినగలిగే పండు కూడా.
శక్తి వనరు: అరటి పండ్లలో సహజ చక్కెరతోపాటు ఫైబర్ మిశ్రమంగా కలిగి ఉంటుంది. ఇది అతి త్వరగా.. దీర్ఘకాలిక శక్తిని అందిస్తుంది. ఆటగాళ్లు, జిమ్‌కు వెళ్లే వారు, వ్యాయామం చేసే వారు.. ముందు, ఆ తర్వాత ఈ అరటి పండ్లు తీసుకుంటారు.
జీర్ణ వ్యవస్థను మెరుగు పరుస్తుంది: ఈ పండు జీర్ణక్రియకు చాలా ప్రయోజనకరిగా పని చేస్తుంది. ఈ పండులోని ఫైబర్ ఆహారాన్ని జీర్ణం చేయడంలో సహాయపడుతుంది. వాటిలో ప్రీ బయోటిక్స్ ఉంటాయి. ఇవి పేగులలో మంచి బ్యాక్టిరీయా పెరుగుదలకు దోహదం చేస్తుంది. ఈ పండు తినడం వల్ల మలబద్ధకం సమస్య నుంచి బయట పడవచ్చు.
గుండె ఆరోగ్యానికి మేలు: అరటి పండులో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యానికి అవసరమైన ఖనిజం. పొటాషియం శరీరంలోని సోడియం ప్రభావాలను సమతుల్యం చేయడం ద్వారా రక్షపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇది అధిక రక్తపోటు, గుండె జబ్బుల ప్రమాదాన్ని నియంత్రిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రతి రోజూ రెండు అరటి పండ్లు తినడం వల్ల శరీరానికి తగినంత పొటాషియం లభిస్తుంది. ఇది గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
ఒత్తిడి నియంత్రిస్తుంది: ఈ రోజుల్లో ఒత్తిడి సాధారణ సమస్యగా మారింది. ఈ సమస్య నుంచి ఉపశమనం పొందడంలో అరటిపండు సహాయపడుతుంది. వాటిలో ట్రిప్టోఫాన్ ఉంటుంది. ఇది శరీరానికి మంచి అనుభూతి ఇచ్చే హార్మోన్.. సెరోటోనిన్ ఉత్పత్తి చేయడానికి దోహద పడుతుంది. సెరోటోనిన్ మానసిక స్థితిని మెరుగుపరచడంలో.. ఒత్తిడిని నియంత్రించడంతోపాటు మంచి నిద్రకు సహయపడుతుంది.
రక్తహీనతను తగ్గిస్తుంది: శరీరంలో తగినంత ఇనుము లేకపోవడం వల్ల రక్తహీనత సమస్య ఉత్పన్నమవుతుంది. అరటిపండులో అధిక మొత్తంలో ఇనుము ఉంటుంది. ఇది హిమోగ్లోబిన్ ఉత్పత్తికి సహయపడుతుంది. అంతేకాకుండా.. అందులోని విటమిన్ బి6 శరీరంలో హిమోగ్లోబిన్ ఉత్పత్తికి కారణమవుతుంది.
బరువు తగ్గడంలో..: అరటి పండులో కేలరీలు స్వల్పంగా.. ఫైబర్ అధికంగా ఉంటుంది. ఈ క్రమంలో వాటిని తినడం వల్ల అధిక సమయం కడుపు నిండిన అనుభూతి పొందవచ్చు. ఇది అతిగా తినడాన్ని తగ్గిస్తుంది.
ఇక ఈ వ్యాసం.. ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న నివేదికలు, సమాచారం అధారంగా రూపొందించబడింది. ఏబీఎన్ ఆంధ్రజ్యోతికి దీనికి ఎటువంటి సంబంధం లేదు, దీనికి ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఏ విధంగానూ బాధ్యత వహించదని మనవి.
ఈ వార్తలు కూడా చదవండి..
మనసు కుదురుగా ఉండక పోవడమూ పోస్టు ట్రమాటిక్ స్ట్రెస్ డిజార్డరే..
కంటి చుక్కలు వేసేటప్పుడు ఈ తప్పులు చేయకండి.!
For More Health News And Telugu News