Share News

Health: మనసు కుదురుగా ఉండక పోవడమూ పోస్టు ట్రమాటిక్‌ స్ట్రెస్‌ డిజార్డరే..

ABN , Publish Date - Oct 10 , 2025 | 10:11 AM

ఊహించని విషాదం కొందరిని కొన్నేళ్లపాటు వెంటాడుతుంది. పదేపదే ఆ పాతచేదు జ్ఞాపకాలు మనసును వేధిస్తుంటాయి. కలలోనూ ఆ కల్లోల దృశ్యాలే. కంటినిండా కునుకు ఉండదు. తిండి సహించదు. భయం, ఆందోళన కమ్మేసి కుంగుబాటులోకి నెడతాయి.

Health: మనసు కుదురుగా ఉండక పోవడమూ పోస్టు ట్రమాటిక్‌ స్ట్రెస్‌ డిజార్డరే..

- నేడు ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం

హైదరాబాద్‌ సిటీ: ఊహించని విషాదం కొందరిని కొన్నేళ్లపాటు వెంటాడుతుంది. పదేపదే ఆ పాతచేదు జ్ఞాపకాలు మనసును వేధిస్తుంటాయి. కలలోనూ ఆ కల్లోల దృశ్యాలే. కంటినిండా కునుకు ఉండదు. తిండి సహించదు. భయం, ఆందోళన కమ్మేసి కుంగుబాటులోకి నెడతాయి. మనసు కుదురుగా ఉండలేదు. సానుకూలంగా ఆలోచించలేదు. అంతా నిరాశ, నిస్పృహే. ఇవన్నీ పోస్టు ట్రమాటిక్‌ స్ట్రెస్‌ డిజార్డర్‌లో భాగమే అని ఎర్రగడ్డ మానసిక వైద్యశాల సూపరింటెండెంట్‌ డా. అనిత పేర్కొంటున్నారు. శుక్రవారం ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవ నేపథ్యంలో ఈ ప్రత్యేక కథనం..


మనసుకూ ప్రథమ చికిత్స

పోస్టు ట్రమాటిక్‌ స్ట్రెస్‌ డిజార్డర్‌తో బాధపడేవారు తిరిగి మామూలు మనుషులు కావడానికి బంధు, మిత్రుల సహకారం కూడా ఎంతో అవసరమని నిపుణులు చెబుతున్నారు. వాళ్లు చేదు గతాన్ని మరిచిపోవడానికి ఆత్మీయ పలకరింపు, ప్రేమాభిమానాలు ఔషధాల్లా ఉపయోగపడతాయని పేర్కొంటున్నారు. సరైన సమయంలో తగిన కౌన్సెలింగ్‌ ఇవ్వడం ద్వారా ఆందోళన, కుంగుబాటు, ఒత్తిళ్లు వంటి సమస్యలు దరిచేరవని వైద్యులు సూచిస్తున్నారు.


మీరుతున్న మానసిక సమస్యలు...

కరోనా తర్వాత మానసిక సమస్యలు అంతకంతకూ పెరుగుతున్నాయి. టెలీమానస్‌ హెల్ప్‌లైన్‌ను సంప్రదిస్తున్నవారి సంఖ్యే అందుకు ఉదాహరణ. కేంద్ర కుటుంబ, ఆరోగ్య సంక్షేమ శాఖ 2022 అక్టోబరులో దేశవ్యాప్తంగా ‘టెలిమెంటల్‌ హెల్త్‌ అసిస్టెన్స్‌ అండ్‌ నెట్‌వర్కింగ్‌’(టెలీమానస్‌) పేరుతో ఉచిత హెల్ప్‌లైన్‌ను ప్రారంభించింది. అది మొదలైన నాటి నుంచి 2025, జూలై24 వరకు 24లక్షలకుపైగా ఫోన్‌కాల్స్‌కు సమాధానం ఇచ్చినట్లు ప్రతినిధులు ఓ సందర్భంలో వెల్లడించారు. వాటిల్లో 43,346 కాల్స్‌ చదువుపరమైన ఒత్తిళ్లు, 22,740 కాల్స్‌ ఉద్యోగపరమైన సమస్యలు, 73,377కాల్స్‌ ఆరోగ్యపరమైన కష్టాలు, 17,826 కాల్స్‌ స్నేహితులు, సహచరులు, ఇతరులతో సమస్యలు, 18,377 కాల్స్‌ కుటుంబ తగాదాలతో టెలీమాన్‌సకు వచ్చినట్లు సంబంధిత అధికారులు ప్రకటించారు.


మానసిక ఆరోగ్యంపై శిక్షణ అవసరం

ఆపత్కాలాలలో బాధితులు, క్షతగాత్రులకు మానసిక ఆరోగ్య సేవలు అందించడానికి అనుగుణంగా ఆశా, అంగన్వాడీ టీచర్లతో పాటు స్వచ్ఛంద సంస్థలు, యువజన సంఘాల ప్రతినిధులకు, ఉపాధ్యాయులు, ఎన్‌సీసీ వలంటీర్లకు, సామాజిక కార్యకర్తలకు మానసిక ఆరోగ్యంపై పెద్దఎత్తున శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలి. విపత్కాలాలలో వాళ్ల సేవలు వినియోగించుకోవాలి. మానసిక స్థైర్యాన్ని అందించడం ద్వారా తిరిగి మామూలు జీవితంలోకి వస్తారు.

city8.2.jfif

- డా. ఇండ్ల రామసుబ్బారెడ్డి, సీనియర్‌ సైకియాట్రిస్టు, విజయవాడ


ఈ వార్తలు కూడా చదవండి..

సీఎం కాన్వాయ్‌ అంబులెన్స్‌కు ఇన్సూరెన్స్‌ మరిచారు

భార్య డబ్బులు ఇవ్వలేదని చెరువులో దూకిన భర్త

Read Latest Telangana News and National News

Updated Date - Oct 10 , 2025 | 10:21 AM