Share News

Beetroot: బీట్‌రూట్ తొక్కల వల్ల ఇన్ని ఉపయోగాలా..?

ABN , Publish Date - Nov 11 , 2025 | 04:20 PM

బీట్‌రూట్ తినడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో అందరికి తెలిసిందే. కానీ వాటి తొక్కలతో అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అవి కొందరికే తెలుసు..

Beetroot: బీట్‌రూట్ తొక్కల వల్ల ఇన్ని ఉపయోగాలా..?

శీతాకాలం వచ్చేసింది. ఈ కాలంలో బీట్‌రూట్‌ను సూపర్‌ఫుడ్‌గా పరిగణిస్తారు. దీనిని జ్యూస్‌లు, సలాడ్‌లతోపాటు పలు రూపాల్లో ఆహారంలో భాగంగా చేసుకుంటారు. దీనిలో అధిక మొత్తంలో నీరు ఉంటుంది. ఇది శరీరాన్ని హైడ్రేటెడ్‌‌గా ఉంచడానికి సహాయపడుతుంది. ఈ బీట్‌రూట్‌లో ఫైబర్‌తోపాటు ఐరన్ ఉంటుంది. ఇది రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిని పెంచుతుంది. వీటిని ప్రతిరోజు తీసుకోవడం వల్ల శరీరానికి అనేక విధాలుగా ప్రయోజనం కలుగుతుంది. అయితే బీట్‌రూట్‌ తొక్కను మాత్రం పక్కన పడేస్తారు. కానీ దీని తొక్క వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయి. అవి ఇవి..

బీట్‌రూట్ తొక్కలతో చర్మం, జుట్టుకు మంచి ఉపయోగం ఉంది. ఈ తొక్కలను ఫేస్ లేదా హెయిర్ ప్యాక్‌ల తయారీలో వినియోగిస్తారు.


బీట్ రూట్ తొక్కతో ఫేస్ ప్యాక్‌ తయారి..

ఇలా చేసుకోవాలి.. బీట్ రూట్ తొక్కను శుభ్రం చేసి బాగా రుబ్బుకోవాలి. దీనికి కొంచెం రోజ్ వాటర్‌తోపాటు శనగపిండి కలపాలి. దాంతో ఇది పేస్ట్‌లా చేసి.. ముఖానికి 10 నుంచి 15 నిమిషాలు అప్లై చేసి.. ఆ తర్వాత సాధారణ నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ ఫేస్ ప్యాక్ మీ చర్మాన్ని ప్రకాశవంతం చేస్తుంది. అంతేకాదు.. ముఖంపై మచ్చలను సైతం తొలగిస్తుంది.


పెదవికి..

శీతాకాలంలో దాదాపు ప్రతి ఒక్కరి పెదవులు పగిలిపోతుంటాయి. బీట్ రూట్ తొక్కతో ఈ సమస్య నుంచి బయట పడవచ్చు. అది ఎలాగంటే.. తొక్కలను ఎండబెట్టాలి. దాని నుంచి రసం తీయాలి. దానికి కొద్దిగా కొబ్బరి నూనె కలపాలి. దీనిని పలుచగా చేసి.. పెదవులపై అప్లై చేయాలి. ఇది పెదవులును తేమగా ఉంచడమే కాకుండా.. గులాబీ రంగులో ఉంచుతాయి.


తోటలో ఎరువుగా..

ఈ బీట్ రూట్ తొక్కను కంపోస్ట్‌గా చేసుకోవచ్చు. ఇతర కూరగాయాల తొక్కలతో కలిపి కంపోస్ట్‌గా వాడుకోవచ్చు. దీనిని మొక్కలకు ఎరువుగా ఉపయోగిస్తే.. ఆవి బాగా పెరుగుతాయి.


హెయిర్ ప్యాక్..

బీట్ రూట్ తొక్కలను మంచి నీటితో కడగాలి. ఆ తర్వాత వాటిని పేస్ట్‌గా రుబ్బుకోవాలి. అలా కాకుంటే.. బీట్‌రూట్ తొక్కలను నీటిలో మరిగించాలి. ఆ తర్వాత ఈ నీటితో జుట్టును శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చుండ్రు తగ్గుతుంది. అలాగే సహజమైన హెయిన్ టానిక్‌ ( వివిధ రకాల హెల్త్ టానిక్‌లను సూచించడానికి ఉపయోగించే పదం) గా పని చేస్తుంది.


గమనిక.. బీట్‌రూట్ తొక్కలను ఉపయోగించే ముందు వాటిని బాగా కడగాలి. ఎందుకంటే.. వాటిపై మురికి లేదా రసాయనాలు ఉంటాయి. నీటితో శుభ్రం చేస్తే.. అవి తొలగిపోతాయి. అలా చేయకుంటే.. అలర్జీ లేదా చర్మంపై దద్దుర్లు వచ్చే ప్రమాదం ఉంది. ఒక వేళ.. బీట్‌రూట్ తొక్క పేస్ట్‌ను శరీరంపై కొద్దిగా రాసుకుని చూడాలి. ఎటువంటి చెడు ప్రభావం లేకుంటే.. దీనిని అప్లై చేసుకోవాలి.

ఈ వార్తలు కూడా చదవండి..

శీతాకాలంలో ముల్లంగి వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసా?

శీతాకాలంలో వాకింగ్ చేసేవారు ఈ విషయాలు గుర్తుంచుకోవాలి.!

For More Health News

Updated Date - Nov 11 , 2025 | 04:44 PM