Weight Loss: థైరాయిడ్ బరువు వదిలించుకోలేకపోతున్నారా? దిగులుపడకండి.. ఈ చిట్కాతో ప్రాబ్లం సాల్వ్..
ABN , Publish Date - May 31 , 2025 | 03:26 PM
Acupressure for Weight Loss: థైరాయిడ్ కారణంగా చాలా మంది మహిళలు వేగంగా బరువు పెరిగిపోతారు. ఈ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలో తెలీక సతమవుతున్నారు. కానీ, ఇందుకో చక్కటి మార్గముంది. చేతిలో ఈ భాగాన్ని నొక్కారంటే..

How to Reduce Thyroid Weight Easily: థైరాయిడ్ సమస్యలు మహిళల్లోనే ఎక్కువగా కనిపిస్తాయి. దీని కారణంగా హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది. ఫలితంగా చాలా మంది మహిళలు ఊబకాయానికి గురవుతున్నారు. ఈ ఊబకాయాన్ని తగ్గించుకోవడానికి సరైన ఆహారం, వ్యాయామం రెండూ అవసరం. అయినప్పటికీ థైరాయిడ్ గ్రంథి పనితీరు మెరుగుపడకపోతే మహిళలు బరువు తగ్గడం కష్టం. అటువంటి పరిస్థితి మీరూ ఎదుర్కొంటుంటే ఈ సింపుల్ చిట్కా ప్రయత్నించి చూడండి. తప్పకుండా ఫలితం కనిపిస్తుంది.
థైరాయిడ్ ఉంటే బరువు ఎందుకు పెరుగుతారు?
హైపోథైరాయిడిజం ఉన్నవారిలో థైరాయిడ్ ఉత్పత్తి తగ్గుతుంది. దీని కారణంగా జీవక్రియ నెమ్మదిగా ఉంటుంది. కాబట్టి, అలాంటివారు క్రమంగా బరువు పెరుగుతారు. అందుకే మహిళలు ముందు నుంచే థైరాయిడ్ హార్మోన్ల పనితీరును నియంత్రించడంపై శ్రద్ధ చూపడం చాలా ముఖ్యం. థైరాయిడ్ కారణంగా ఎవరైనా బరువు పెరుగుతున్నట్లయితే వారు ఈ ఆహార నియమాలను పాటించాలి.
థైరాయిడ్ ఉన్నవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
ఫైబర్, పీచు అధికంగా ఉండే ఆహారాలు తినాలి.
చక్కెర, రెడ్ మీట్, ఆల్కహాల్, వేపుళ్లు, ప్రాసెస్ చేసిన ఆహారాలకు దూరంగా ఉండండి.
ఆహారంలో సెలీనియం అధికంగా ఉండే ఆహారాలను చేర్చుకోండి.
రోజులో చాలాసార్లు కొద్ది కొద్ది పరిమాణంలో తింటూ ఉండాలి.
ఆహారంలో కార్బోహైడ్రేట్లను తగ్గించుకోవాలి.
తగినంత నీరు తాగాలి.
దినచర్యలో వ్యాయామాన్ని చేర్చుకోండి.
తినాల్సిన ఆహార పదార్థాలు
బెర్రీలు (బ్లూబెర్రీస్, బ్లాక్బెర్రీస్, స్ట్రాబెర్రీస్, చెర్రీస్), సిట్రస్ పండ్లు (నారింజ, నిమ్మకాయలు), ఆకుకూరలు (పాలకూర, కాలే, కొల్లార్డ్ గ్రీన్స్),బ్రోకలీ, కాలీఫ్లవర్, టమోటాలు, ఓట్స్, క్వినోవా, బ్రౌన్ రైస్, హోల్ వీట్ బ్రెడ్, బాదం, వాల్‌నట్‌లు, అవిసె గింజలు, చియా గింజలు, పొద్దుతిరుగుడు విత్తనాలు, బీన్స్, చిక్కుళ్లు, కాయధాన్యాలు, శనగలు, పసుపు, అల్లం, వెల్లుల్లి, సాల్మన్, ట్యూనా, మాకేరెల్ చేపలు, గుడ్లు, చికెన్ తదితర యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఆహారాలు తినాలి.
ఆక్యుప్రెషర్‌తో థైరాయిడ్ బరువు తగ్గించుకోండిలా..
థైరాయిడ్ సమస్యలకు ఆక్యుప్రెషర్ ప్రభావవంతంగా పనిచేస్తుంది. నిజానికి వేర్వేరు సమస్యలకు వేర్వేరు ప్రెజర్ పాయింట్లు ఉంటాయి. థైరాయిడ్ కారణంగా బరువు పెరిగితే చేతిలో ఈ పాయింట్ వద్ద నొక్కడం వల్ల బరువు తగ్గుతారు. ఈ పీడన బిందువును యూనియన్ వ్యాలీ అంటారు. ఇది అనేక ఇతర నొప్పులకు కూడా సహాయపడుతుంది. రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. చూపుడు వేలు, బొటనవేలు మధ్య ఉండే మృదువైన భాగంపై చేత్తో ఒత్తిడి రాజేయడం వల్ల రక్త ప్రసరణ బలపడుతుంది. అలాగే, బొటనవేలు కీలును పట్టుకుని మసాజ్ చేయండి లేదా మరొక బొటనవేలు సహాయంతో ఈ భాగాన్ని నొక్కండి. రెండు చేతుల బొటనవేలు కీలును నొక్కడం లేదా మసాజ్ చేయడం ద్వారా థైరాయిడ్ హార్మోన్ పనితీరు నియంత్రించబడుతుంది. ఈ బిందువుపై ప్రతిరోజూ కనీసం ఐదు నిమిషాలు ఒత్తిడి ఉంచడం ప్రయోజనకరంగా ఉంటుంది.
ఇవి కూడా చదవండి:
ప్రతి మహిళ తప్పక చేయించుకోవాల్సిన 8 ఆరోగ్య పరీక్షలు..
నేడు ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం..