Weight Loss Tips: జిమ్‍కు వెళ్లలేకపోతున్నారా.. అయితే ఈ ఇంటి పనులు చాలు.. వర్కవుట్లు చేయకుండానే వెయిట్ లాస్..
ABN , Publish Date - May 08 , 2025 | 07:55 PM
Weight Loss Without Gym: జిమ్‍కు వెళ్లటానికి సమయం చిక్కటం లేదా.. లేదంటే రోజూ వెళ్లాలంటే బద్ధకంగా అనిపిస్తోందా.. అయినా, ఏం పర్లేదు. వర్కవుట్లు చేయకుండానే అధిక బరువు తగ్గించుకునేందుకు బోలెడన్ని మార్గాలున్నాయి. రోజూ ఇంట్లో ఈ పనులు చేస్తే చాలు. వర్కవుట్లు చేసినట్టే లెక్క.
Simple Home Tasks For Weight Loss: బరువు తగ్గడం చాలా కష్టం. అంత ఈజీ కాదనే ఫీలింగ్ మీకూ ఉందా. క్రమంగా తప్పకుండా జిమ్‍కు వెళ్తే తప్ప ఫిట్‌గా ఉండటం సాధ్యం కాదనే భావనలో ఉన్నారా. అయితే, ఈ క్షణమే ఆ అభిప్రాయాన్ని మార్చేసుకోండి. కఠినమైన వర్కవుట్లు, డైట్ పాటిస్తేనే బరువు తగ్గుతారనేది పాత మాట. ఇంట్లో రోజూ చేసే ఈ చిన్న చిన్న పనులు కూడా బరువు తగ్గడానికి సాయపడతాయని మీకు తెలుసా? అవును, మీకు జిమ్‌కు వెళ్లడానికి సమయం లేకపోయినా లేదా కఠినమైన డైట్ పాటించకూడదని అనుకుంటే ఈ పనులను మీ దినచర్యలో భాగం చేసుకోండి. శరీరంలోని కేలరీలు ఇట్టే కరిగిపోయి ఫిట్‌గా ఉంటారు.
ఈ ఇంటి పనులు రోజూ చేస్తే ఈజీగా బరువు తగ్గచ్చు:
1. శుభ్రపరచడం
ఇంటిని శుభ్రం చేయడం వల్ల మీ చుట్టూ ఉన్న వాతావరణం శుభ్రంగా ఉంటుంది. మంచి శారీరక శ్రమ కూడా. ఊడ్చడం, తుడవడం, బట్టలు ఉతకడం, పాత్రలు శుభ్రం చేయడం వంటివి మీ శరీరాన్ని చురుకుగా ఉంచుతాయి. కేలరీలను బర్న్ చేస్తాయి. డైలీ 30 నిమిషాల పాటు కింద పనులు చేస్తే ఎన్ని క్యాలరీలు తగ్గుతాయో తెలుసుకోండి.
స్వీపింగ్ చేస్తే 100-150 కేలరీలు బర్న్ చేయగలదు.
నేల తుడిస్తే 150-200 కేలరీలు బర్న్ చేయవచ్చు.
చేత్తో బట్టలు ఉతకడంవల్ల 120-150 కేలరీలు బర్న్ చేయవచ్చు.
2. మెట్లు ఎక్కడం
లిఫ్ట్ కు బదులుగా మెట్లు ఉపయోగించడం గొప్ప వ్యాయామం. ఇది మీ దిగువ శరీర భాగాలను (తొడలు, కాళ్ళు, తుంటి) బలపరుస్తుంది. గుండె ఆరోగ్యానికి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రతిరోజూ మెట్లు ఎక్కడం, దిగడం ద్వారా దాదాపు 200-300 కేలరీలు సులభంగా కరిగిపోతాయి.
3. తోటపని
బరువు తగ్గడానికి, తోటపనిని మించింది లేదు. మొక్కలకు నీరు పెట్టడం, కలుపు మొక్కలను తొలగించడం, కుండలను మార్చడం, మట్టిని తవ్వడం వంటి కార్యకలాపాలు మీ శరీరాన్ని చురుకుగా ఉంచుతాయి. 30 నిమిషాలు తోటపని చేస్తే ఒంట్లో 150-200 కేలరీలు తగ్గిపోతాయి.
4. వంట
వంట చేయడం (కూరగాయలు కోయడం, పిండి కలుపుకోవడం, పాత్రలు శుభ్రం చేయడం వంటివి) కూడా ఒక రకమైన శారీరక శ్రమ. కూర్చొనే కంటే నిలబడి వంట చేస్తే ఎక్కువ కేలరీలు ఖర్చవుతాయి. ఇలా రోజూ అరగంట చేస్తే దాదాపు 80-120 కేలరీలు ఖర్చవుతాయి.
5. పిల్లలతో ఆడుకోవడం
మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే వారితో ఆడుకోవడం ఒక ఆహ్లాదకరమైన కార్యకలాపం. అలాగే కేలరీలను బర్న్ చేయడానికి మంచి మార్గం. పరిగెత్తడం, దాగుడుమూతలు ఆడటం లేదా డాన్స్ చేయడం ద్వారా మీరు ఒక గంటలోనే 200-300 కేలరీల వరకూ తగ్గించుకోవచ్చు.
6. మాట్లాడుతూ నడవడం
మీకు ఎక్కువసేపు ఫోన్‌లో మాట్లాడే అలవాటుంటే కూర్చునేందుకు బదులుగా నడుస్తున్నప్పుడు మాట్లాడండి. ఇది మీ అడుగుల సంఖ్యను పెంచి అదనపు కేలరీలను కరిగిస్తుంది. రోజూ 30 నిమిషాల నడక వల్ల 100-150 కేలరీలు ఖర్చవుతాయి.
Read Also: Health Tips: జిమ్‌కి వెళ్లడానికి బద్దకమా.. బరువు తగ్గడానికి ఈ 6 ఇంటి పనులను ప్రాక్టీస్ చేస్తే చాలు
Health Tips: వేసవిలో ఫుడ్ పాయిజనింగ్ ఎందుకు జరుగుతుంది.. కారణం ఏమిటో తెలుసా..
Supplements for Muscle Growth: క్రియాటిన్, ప్రొటీన్ సప్లిమెంట్స్... మజిల్స్