Share News

Supplements for Muscle Growth: క్రియాటిన్, ప్రొటీన్ సప్లిమెంట్స్... మజిల్స్ పెంచేందుకు ఏది బెటరంటే..

ABN , Publish Date - May 06 , 2025 | 06:54 PM

కండలు తిరిగిన దేహం కోసం క్రియాటిన్, ప్రొటీన్ సప్లిమెంట్‌‌లో ఏది బెటరని అనుకుంటున్నారా? అయితే, ఈ కథనం మీకోసమే.

Supplements for Muscle Growth: క్రియాటిన్, ప్రొటీన్ సప్లిమెంట్స్... మజిల్స్ పెంచేందుకు ఏది బెటరంటే..
Supplements for Muscle Growth

ఇంటర్నెట్ డెస్క్: కండలు తిరిగిన దేహం కావాలంటే కేవలం జిమ్‌లో చెమటలు చిందిస్తే సరిపోదు. ఈ శ్రమకు తిగిన పోషకాలు శరీరానికి అందితేనే ఆశించిన ఫలితం దక్కుతుంది. అందుకే అనేక మంది కండల కోసం పోషకాలు ఉండే పలు సప్లిమెంట్స్ తీసుకుంటూ ఉంటారు. సాధారణంగా జనాలు ప్రొటీన్ పౌడర్లు, క్రియాటిన్ సప్లిమెంట్స్ తీసుకుంటూ ఉంటారు. ఈ రెండింట్లో ఏదోఒకటి ఎంచుకుంటే చాలని అనుకునే వారూ ఉన్నారు. అయితే, ఇవి ఒకదానికొకటి ప్రత్యామ్నాయాలు కావాలని నిపుణులు చెబుతున్నారు.

క్రియాటిన్‌ శరీరంలో ఏటీపీ ఉత్పత్తి పెంచేందుకు సహకరిస్తుంది. శరీరంలో శక్తి పుట్టించేందుకు ఏటీపీ కీలకం. అన్ని శారీరక క్రియలకు ఏటీపీ మూలం. కండరాల రిపేర్‌కు ఇది ముఖ్యం. అయితే, కండరాల పెరుగుదలకు ఇది కారణం కాదని హార్వర్డ్ పరిశోధకులు చెబుతున్నారు. అయితే, క్రియాటిన్ తీసుకుంటూ క్రమం తప్పకుండా రెసిస్టెన్స్ ట్రెయింగ్‌లో పాల్గొనేవారికి దేశదారుఢ్యం పెరుగుతుంది. కండలు తిరిగిన దేహం సొంతమవుతుంది.


ఇక కండల పెరుగుదలకు ప్రొటీన్ సప్లిమెంట్స్ కీలకం. మజిల్ ఫైబర్స్ నిర్మాణానికి ప్రోటీన్లే కావాలి. కసరత్తుల సమయంలో కండల్లో సూక్ష్మ స్థాయి గాయాలు అవుతాయి. వీటిని మైక్రోటేర్స్ అని అంటారు. ఈ గాయాలను నయం చేసే సమయంలో కొత్త మజిల్ ఫైబర్స్ తయారయ్యి కండలు పెరుగుతాయి. ఈ ప్రక్రియకు ప్రొటీన్లు, అమైనో యాసిడ్స్ అవసరం.


కాబట్టి కండలు తిరిగిన దేహం సొంతం కావాలంటే .. అటు క్రియాటిన్, ఇటు ప్రొటీన్ రెండూ అవసరమేనని నిపుణులు చెబుతున్నారు. కసరత్తులు మెరుగ్గా చేసేందుకు, శక్తి ఉత్పత్తికి క్రియాటిన్ అవసరం. కండల వృద్ధికి ప్రొటీన్లు అవసరం. పూర్తి స్థాయి ఫిట్‌నెస్ సాధించాలంటే ఈ రెండూ తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. జిమ్‌‌లో కసరత్తులు చేయడంతో పాటు నిరంతర విరామం కూడా అవసరమని అన్నారు.

ఇవి కూడా చదవండి:

ఈ సింపుల్‌ టెక్నిక్‌తో నీళ్లల్లోని మైక్రో ప్లాస్టిక్స్‌ను సులువుగా తొలగించుకోవచ్చు

ఈ టైమ్‌లో స్వీట్స్ తింటే నో టెన్షన్

కిడ్నీ సమస్యలున్న వాళ్లు టమాటాలు ఎందుకు తినొద్దంటే..

మధ్యాహ్నం నిద్రతో ఆరోగ్యానికి చేటు కలుగుతుందా?

Read Latest and Health News

Updated Date - May 06 , 2025 | 06:58 PM