KTR On Jubilee Hills: మళ్లీ అధికారంలోకి వస్తారన్న నమ్మకం రేవంత్ రెడ్డికి లేదు..
ABN , Publish Date - Oct 26 , 2025 | 12:03 PM
కాంగ్రెస్, బీజేపీ కలిసి తెలంగాణలో లోపాయికారీ పని చేస్తున్నాయని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్, బీజేపీలు బలమైన ప్రాంతీయ పార్టీలన్నింటిని బీ టీమ్ అంటుందని పేర్కొన్నారు.
హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా షేక్‌పేట్‌లోని రిలయన్స్ జూబ్లీ గేటెట్ కమ్యూనిటీ నివాసులతో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పదేళ్ల బీఆర్‌ఎస్ ప్రగతి వర్సెస్ రెండేళ్ల కాంగ్రెస్ మోసాల పాలన చూసి జూబ్లీహిల్స్ ప్రజలు ఓటు వేయాలని కేటీఆర్ అన్నారు. రెండు సంవత్సరాలుగా అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపించారు. మైనార్టీ ప్రాతినిధ్యం లేని తొలి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఏర్పడిందని విమర్శించారు.
కాంగ్రెస్, బీజేపీ కలిసి తెలంగాణలో లోపాయికారీ పని చేస్తున్నాయని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్, బీజేపీలు బలమైన ప్రాంతీయ పార్టీలన్నింటిని బీ టీమ్ అంటుందని పేర్కొన్నారు. తెలంగాణలో బుల్డోజర్ రాజ్యం నడుస్తుందని తెలిపారు. బీజేపీతో కలిసి పని చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి గురించి రాహుల్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని విమర్శించారు. మళ్లీ అధికారంలోకి వస్తామన్న నమ్మకం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులకు కూడా లేదని కేటీఆర్ ఎద్దేవా చేశారు.
కాగా, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయం మరింత రసవత్తరంగా మారుతోంది. నామినేషన్ల ప్రక్రియ ముగియగా.. ఇప్పుడు ప్రచార పర్వం ఊపందుకుంది. నియోజకవర్గ పరిధిలో అధికార బీఆర్ఎస్.. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలు హోరాహోరీగా ప్రచారం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ(ఆదివారం) షేక్‌పేట్‌లోని ప్రచారంలో మాజీ మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. అయితే జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు మొత్తం 150కి పైగా నామినేషన్లు దాఖలయ్యాయి. ప్రత్యర్థుల మధ్య పోటాపోటీ ఉండటంతో ఎవరు గెలుస్తారనే ఉత్కంఠ రోజురోజుకి పెరుగుతోంది. నవంబర్ 11న జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు పోలింగ్.. 14న కౌంటింగ్ జరగనున్న విషయం తెలిసిందే.
ఇవి కూడా చదవండి..
Investment in Adani Raises: జీవిత బీమా..అదానీకి ధీమా
Congress Demands: పీఏసీ దర్యాప్తు జరగాలి కాంగ్రెస్