SBI PO Prelims Result 2025 Out: ఎస్బీఐ పీఓ ఫలితాలు విడుదల..ఒక్క క్లిక్‌తో ఇలా తెలుసుకోండి
ABN , Publish Date - Sep 01 , 2025 | 08:17 PM
ఎస్బీఐ పీఓ ఎగ్జామ్ రాసిన అభ్యర్థులకు కీలక అలర్ట్ వచ్చేసింది. ఎందుకంటే SBI తాజాగా PO ప్రిలిమ్స్ 2025 ఫలితాలను విడుదల చేసింది. అవి ఎక్కడ, ఎలా డౌన్ లోడ్ చేసుకోవాలనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) PO ప్రిలిమ్స్ 2025 రిజల్ట్స్‌ను తాజాగా (సెప్టెంబర్ 1, 2025న) విడుదల చేసింది. ఆగస్టు 2, 4, 5 తేదీల్లో జరిగిన ప్రొబేషనరీ ఆఫీసర్ (PO) ప్రిలిమ్స్ పరీక్ష రాసిన క్యాండిడేట్స్ ఇప్పుడు తమ రిజల్ట్స్‌ను ఈ అధికారిక వెబ్‌సైట్ sbi.co.inలో చెక్ చేసుకోవచ్చు.
SBI PO ప్రిలిమ్స్ రిజల్ట్ 2025 ఎలా చెక్ చేసుకోవాలి?
ముందు SBI అధికారిక వెబ్‌సైట్ sbi.co.inకి వెళ్లండి.
హోమ్‌పేజీలో ఉన్న Careers లింక్‌పై క్లిక్ చేయండి.
అక్కడ కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అందులో SBI PO Prelims Result 2025 లింక్‌ను క్లిక్ చేయండి.
మీ లాగిన్ డీటెయిల్స్ (రిజిస్ట్రేషన్ నంబర్, పాస్‌వర్డ్) ఎంటర్ చేసి Submit బటన్ నొక్కండి.
మీ రిజల్ట్ స్క్రీన్‌పై కనిపిస్తుంది
రిజల్ట్‌ను చెక్ చేసుకుని, డౌన్‌లోడ్ చేసుకోండి. భవిష్యత్తు కోసం ఒక హార్డ్ కాపీని ప్రింట్ తీసుకుని పెట్టుకోండి.
ప్రిలిమ్స్ రిజల్ట్ తర్వాత నెక్ట్స్ ఏంటి
SBI PO ప్రిలిమ్స్ ఫలితాలు విడుదలైన తర్వాత, అర్హత సాధించిన అభ్యర్థులు తదుపరి దశ అయిన మెయిన్ పరీక్షకు ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. ఈ మెయిన్ పరీక్షలో రీజనింగ్, డేటా అనాలిసిస్, జనరల్ అవేర్‌నెస్, ఇంగ్లీష్, కంప్యూటర్ ఆప్టిట్యూడ్ సబ్జెక్టులు ఉంటాయి. మెయిన్ పరీక్షలో కట్ ఆఫ్ సాధించిన అభ్యర్థులు ఇంటర్వ్యూ, గ్రూప్ ఎక్సర్‌సైజ్‌లకు ఎంపిక చేయబడతారు. SBI PO మెయిన్స్ ఎగ్జామ్ సెప్టెంబర్ 2025లో నిర్వహించే అవకాశం ఉంది.
మొత్తం పోస్టులు..
ఈ SBI PO రిక్రూట్‌మెంట్ ద్వారా మొత్తం 541 ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టులు భర్తీ కానున్నాయి. అందులో 500 రెగ్యులర్ వేకెన్సీలు, 41 బ్యాక్‌లాగ్ ఖాళీలు ఉన్నాయి. SBI PO జాబ్ ద్వారా బ్యాంకింగ్ సెక్టర్‌లో ప్రతిష్టాత్మకమైన రోల్‌లో మీరు ఫైనాన్షియల్ సర్వీసెస్, కస్టమర్ మేనేజ్‌మెంట్, లీడర్‌షిప్ స్కిల్స్‌ను అభివృద్ధి చేసుకోవచ్చు. SBI లాంటి భారతదేశంలోని అతిపెద్ద బ్యాంక్‌లో పనిచేయడం అంటే మీ కెరీర్ పూర్తిగా మారిపోతుందని చెప్పవచ్చు.
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి