Share News

Education: పీజీఈసెట్‌ అభ్యర్థులకు ‘టీసీ’ కష్టాలు..

ABN , Publish Date - Oct 10 , 2025 | 08:32 AM

పోస్ట్‌ గ్రాడ్యుయేటెడ్‌ ఇంజనీరింగ్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (పీజీఈసెట్‌)లో అర్హత సాధించిన అభ్యర్థులను ట్రాన్స్‌ఫర్‌ సర్టిఫికెట్‌(టీసీ) కష్టాలు వెంటాడుతున్నాయి.

Education: పీజీఈసెట్‌ అభ్యర్థులకు ‘టీసీ’ కష్టాలు..

- ఫీజు బకాయిలను విడుదల చేయని ప్రభుత్వం

- సర్టిఫికెట్లను జారీ చేయని ప్రైవేటు కాలేజీలు

- ఎంటెక్‌ అడ్మిషన్లు కోల్పోతున్న అభ్యర్థులు

హైదరాబాద్‌ సిటీ: పోస్ట్‌ గ్రాడ్యుయేటెడ్‌ ఇంజనీరింగ్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (పీజీఈసెట్‌)లో అర్హత సాధించిన అభ్యర్థులను ట్రాన్స్‌ఫర్‌ సర్టిఫికెట్‌(టీసీ) కష్టాలు వెంటాడుతున్నాయి. ప్రభుత్వం నుంచి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల కాకపోవడంతో బీటెక్‌ పూర్తి చేసిన అభ్యర్థులకు ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు ట్రాన్స్‌ఫర్‌ సర్టిఫికెట్‌, ప్రొవిజనల్‌ సర్టిఫికెట్లను జారీ చేసేందుకు ససేమిరా అంటున్నాయి. దీంతో పీజీఈసెట్‌ కౌన్సెలింగ్‌ ద్వారా వివిధ కాలేజీల్లో సీట్లు పొందిన అభ్యర్థులకు టీసీ, పీసీ ఒరిజినల్స్‌ లేనిదే అడ్మిట్‌ చేసుకునేది లేదని ఆయా కాలేజీల అధికారులు స్పష్టం చేస్తున్నారు. దీంతో సగం మంది టీసీ, పీసీలు లేక అడ్మిషన్లు కోల్పోతున్నారు.


కాలేజీల్లో రిపోర్టింగ్‌ చేసింది 50శాతమే

పీజీఈసెట్‌ కౌన్సెలింగ్‌ రెండోదశలో పలు కాలేజీలకు ఎంటెక్‌ కోర్సుల్లో 100 శాతం సీట్లు కేటాయించినప్పటికీ, గడువు (గురువారం) ముగిసేలోగా 50 శాతం మంది అభ్యర్థులు (సర్టిఫికెట్లు లేక) రిపోర్టు చేయలేదు. రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల నుంచి హైదరాబాద్‌లోని ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల్లో ఎంటెక్‌ అడ్మిషన్ల కోసం వచ్చిన అభ్యర్థులు దిగాలుగా వెనుదిరిగి పోతున్నారు. టీసీ, పీసీ లేక ఎంటెక్‌ అడ్మిషన్లు కోల్పోతుండడంపై అభ్యర్థుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేయడంతో రిపోర్టింగ్‌ గడువును ఈ నెల 9కి బదులుగా 14వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు కన్వీనర్‌ ప్రకటించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

సీఎం కాన్వాయ్‌ అంబులెన్స్‌కు ఇన్సూరెన్స్‌ మరిచారు

భార్య డబ్బులు ఇవ్వలేదని చెరువులో దూకిన భర్త

Read Latest Telangana News and National News

Updated Date - Oct 10 , 2025 | 08:32 AM