JNTU: 12నుంచి జేఎన్‌టీయూ పీహెచ్‌డీ ప్రవేశ పరీక్షలు
ABN , Publish Date - Aug 23 , 2025 | 07:58 AM
డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ(పీహెచ్‌డీ) ప్రవేశ పరీక్షలను సెప్టెంబర్ 12నుంచి 14 వరకు నిర్వహించనున్నట్లు జేఎన్‌టీయూ ప్రకటించింది. ఈ మేరకు షెడ్యూల్‌ను అడ్మిషన్ల విభాగం డైరెక్టర్ బాలునాయక్ శుక్రవారం విడుదల చేశారు. గత మే నెలలో నోటిఫికేషన్ విడుదల చేయగా, మొత్తం 15 సబ్జెక్టుల్లో పీహెచ్‌డీ అడ్మిషన్ల నిమిత్తం 995మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు.
- షెడ్యూల్ విడుదల చేసిన అడ్మిషన్ల విభాగం డైరెక్టర్..
- 6నుంచి హాల్‌టికెట్లు
హైదరాబాద్ సిటీ: డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ(పీహెచ్‌డీ) ప్రవేశ పరీక్షలను సెప్టెంబర్ 12నుంచి 14 వరకు నిర్వహించనున్నట్లు జేఎన్‌టీయూ(JNTU) ప్రకటించింది. ఈ మేరకు షెడ్యూల్‌ను అడ్మిషన్ల విభాగం డైరెక్టర్ బాలునాయక్ శుక్రవారం విడుదల చేశారు. గత మే నెలలో నోటిఫికేషన్ విడుదల చేయగా, మొత్తం 15 సబ్జెక్టుల్లో పీహెచ్‌డీ అడ్మిషన్ల నిమిత్తం 995మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు.
కెమిస్ట్రీ, మ్యాథ్స్, ఫిజిక్స్, ఎన్విరాన్‌మెంటల్, వాటర్ రిసోర్సెస్, ఇంగ్లీష్, బయోటెక్నాలజీ, నానోటెక్నాలజీ(Biotechnology, Nanotechnology) తదితర కోర్సులకు వచ్చిన దరఖాస్తుల సంఖ్య 30కంటే తక్కువగా ఉన్నట్లు వెల్లడించారు. ఆన్‌లైన్‌లో నిర్వహించే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్(సీబీటీ)లను ప్రతి రోజూ రెండు సెషన్లలో నిర్వహిస్తామన్నారు.

12న మ్యాథ్స్, ఫార్మసీ, కెమిస్ట్రీ, నానోటెక్నాలజీ, బయోటెక్నాలజీ, ఇంగ్లిష్, 13న సివిల్, మ్యాథ్స్, ఫిజిక్స్, ఈసీఈ, ఎన్విరాన్‌మెంటల్ సైన్స్, వాటర్ రిసోర్సెస్, 14న కంప్యూటర్ సైన్స్, ఈఈఈ, మెకానికల్ సబ్జెక్టుల్లో పరీక్షలు నిర్వహిస్తామని డైరెక్టర్ బాలునాయక్ తెలిపారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులు సెప్టెంబర్ 6నుంచి తమ హాల్‌టికెట్లను వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మళ్లీ తగ్గిన బంగారం ధరలు.. నేటి రేట్స్ ఎలా ఉన్నాయంటే..
Read Latest Telangana News and National News