JNTU: జేఎన్‌టీయూ ‘నిలువు’ దోపిడీ.. ప్రాజెక్ట్ పర్మిషన్ల పేరిట రూ.లక్షల్లో పెనాల్టీలు
ABN , Publish Date - Oct 10 , 2025 | 08:19 AM
విద్యార్థులను జేఎన్‌టీయూ నిలువునా దోచుకుంటోందని విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వర్కింగ్ ప్రొఫెషనల్స్‌కు యూజీ, పీజీ అడ్మిషన్ల నోటిఫికేషన్లను, ప్రాజెక్టుల సమర్పణకు పర్మిషన్లు ఇవ్వడంలోనూ నిర్లక్ష్యం వహిస్తున్న జేఎన్‌టీయూ పరిపాలన విభాగం.. వన్‌టైమ్ చాన్స్‌లో బ్యాక్‌లాగ్ సబ్జెక్టులను పూర్తి చేసిన పీజీ అభ్యర్థులపై పెనాల్టీలను బాదుతోందని ఆరోపిస్తున్నాయి.
- లబోదిబోమంటున్న వన్‌టైమ్ చాన్స్ పీజీ అభ్యర్థులు
- అధికారుల తీరుపై విద్యార్థి సంఘాల ఆగ్రహం
హైదరాబాద్ సిటీ: విద్యార్థులను జేఎన్‌టీయూ నిలువునా దోచుకుంటోందని విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వర్కింగ్ ప్రొఫెషనల్స్‌కు యూజీ, పీజీ అడ్మిషన్ల నోటిఫికేషన్లను, ప్రాజెక్టుల సమర్పణకు పర్మిషన్లు ఇవ్వడంలోనూ నిర్లక్ష్యం వహిస్తున్న జేఎన్‌టీయూ(JNTU) పరిపాలన విభాగం.. వన్‌టైమ్ చాన్స్‌లో బ్యాక్‌లాగ్ సబ్జెక్టులను పూర్తి చేసిన పీజీ అభ్యర్థులపై పెనాల్టీలను బాదుతోందని ఆరోపిస్తున్నాయి. బ్యాక్‌లాగ్ సబ్జెక్టులను పూర్తి చేసుకునేందుకు వన్‌టైమ్ చాన్స్ నోటిఫికేషన్ ఇచ్చిన వర్సిటీ ఉన్నతాధికారులు పరీక్షలకు ముందు పెనాల్టీల విషయాన్ని ప్రస్తావించలేదని పేర్కొంటున్నాయి. తీరా సబ్జెక్టులు పూర్తి చేశాక ప్రాజెక్టు సబ్‌మిషన్ సమయంలో ఒక్కొక్కరికి రూ.లక్షకు పైగా జరిమానాలు విధించడంతో బాధిత విద్యార్థులు వాపోతున్నారు.
రూ.2కోట్ల వసూళ్లే లక్ష్యం
సుమారు 200మంది అభ్యర్థుల నుంచి రూ.2కోట్ల వసూళ్లను అధికారులు ధ్యేయంగా పెట్టుకున్నారని, ఇది ముమ్మాటికీ విద్యార్థులను నిలువుదోపిడీ చేయడమేనని విద్యార్థి సంఘాల ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెనాల్టీల భారాన్ని వేయవద్దని వీసీ, రిజిస్ట్రార్‌లకు వినతిపత్రాలు సమర్పించినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏటా సుమారు రూ.350 కోట్లకు పైగా బడ్జెట్ కలిగిన జేఎన్‌టీయూలో విద్యార్థులను దోచుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. ఏటా నెలకు రూ.లక్షల్లో వేతనాలు, రూ.కోట్లలో రెమ్యునిరేషన్లు తీసుకుంటున్న ఉన్నతాధికారులకు రూ.లక్ష పెనాల్టీ అంటే తక్కువేమో కానీ, పేద, మధ్యతరగతి అభ్యర్థులకు రూ.లక్ష చొప్పున పెనాల్టీ అంటే వారిపై పెనుభారం మోపడమేనంటూ అధికారుల తీరును ఆక్షేపిస్తున్నారు.

వీసీ అనుమతికి ముందే ఉత్తర్వుల జారీ
వన్‌టైం చాన్స్ అభ్యర్థులకు పెనాల్టీలు విధిస్తూ వర్సిటీ రిజిస్ట్రార్ పేరిట జారీ అయిన ఉత్తర్వులు తప్పులు తడకలుగా ఉండడం పలు అనుమానాలకు తావిస్తోందని విద్యార్థి సంఘాలు సందేహం వ్యక్తం చేస్తున్నాయి. రిజిస్ట్రార్ ఉత్తర్వులను జారీచేసిన తేదీ సెప్టెంబరు 29 అని ఉండగా, నోట్‌ఫైల్‌ను వైస్‌చాన్స్‌లర్ అనుమతించిన తేదీ అక్టోబరు 6గా పేర్కొన్నారు. రాష్ట్రంలోని సుమారు 200 ఇంజనీరింగ్, మేనేజ్‌మెంట్, ఫార్మసీ కళాశాలల ప్రిన్సిపాల్స్‌కు పంపుతున్న ఉత్తర్వుల కాపీ అస్తవ్యస్తంగా ఉండడం పట్ల ఆయా కాలేజీల ప్రిన్సిపాల్స్ సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ఒకవేళ పెనాల్టీలను చెల్లించాల్సి వస్తే ఎప్పటిలోగా చెల్లించాలనే (గడువు తేదీని) అంశాన్ని ఉత్తర్వుల్లో ప్రస్తావించకపోవడం గమనార్హం. జరిమానాల భారంపై వర్సిటీ వీసీ డాక్టర్ కిషన్‌కుమార్ రెడ్డిని వివరణ కోరేందుకు ‘ఆంధ్రజ్యోతి’ ప్రయత్నించగా, వివరణ ఇచ్చేందుకు ఆయన సుముఖంగా లేరని సిబ్బంది తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
సీఎం కాన్వాయ్ అంబులెన్స్‌కు ఇన్సూరెన్స్ మరిచారు
భార్య డబ్బులు ఇవ్వలేదని చెరువులో దూకిన భర్త
Read Latest Telangana News and National News