Share News

JNTU: ఈసీ సమావేశం వాయిదా..

ABN , Publish Date - Jun 26 , 2025 | 08:32 AM

జేఎన్‌టీయూ పాలకమండలి సమావేశం వాయిదా పడింది. ప్రతి మూడు నెలలకు ఒకసారి సమావేశమై వర్సిటీలో అభివృద్ధి పనులు, విద్యార్థులు, ఉద్యోగులకు సంబంధించిన సమస్యలపై చర్చించాల్సి ఉంది.

JNTU: ఈసీ సమావేశం వాయిదా..

- జేఎన్‌టీయూ పనులపై ప్రభావం

హైదరాబాద్‌ సిటీ: జేఎన్‌టీయూ(JNTU) పాలకమండలి సమావేశం వాయిదా పడింది. ప్రతి మూడు నెలలకు ఒకసారి సమావేశమై వర్సిటీలో అభివృద్ధి పనులు, విద్యార్థులు, ఉద్యోగులకు సంబంధించిన సమస్యలపై చర్చించాల్సి ఉంది. పాలకమండలి సమావేశమై మూడు నెలలు కావస్తుండడంతో బుధవారం సమావేశం నిర్వహించేందుకు అధికారులు సన్నద్ధమయ్యారు. గత ప్రభుత్వ హయాంలో నియమించిన పాలకమండలిలో 14 మంది సభ్యులు ఉండగా, గతేడాది ఫిబ్రవరితో వారి పదవీకాలం ముగిసింది.


నూతన పాలకమండలిని ప్రస్తుత ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు. దీంతో ప్రభుత్వంలోని ఆర్థిక, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శులు, సాంకేతిక విద్యా కమిషనర్‌తో పాటు జేఎన్‌టీయూలో ఇద్దరు అధికారులతోనే సమావేశాలు నిర్వహిస్తున్నారు. అయితే ఎప్‌సెట్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌పై కసరత్తు,


city4.2.jpg

ఇంజనీరింగ్‌ కాలేజీల ఫీజుల ఖరారు వంటి అంశాలపై విద్యాశాఖ, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శులు, సాంకేతిక విద్యా కమిషనర్‌ బిజీగా ఉండడంతో బుధవారం నిర్వహించాలనుకున్న సమావేశం నిరవధికంగా వాయిదా వేసినట్లు తెలిసింది. సమావేశం జరగక వర్సిటీకి సంబంధించిన అభివృద్ధి పనులు, సిబ్బంది సమస్యల పరిష్కారంలో ఎడతెగని జాప్యం తప్పడం లేదు.


ఈ వార్తలు కూడా చదవండి.

వావ్.. మళ్లీ తగ్గిన తగ్గిన బంగారం, వెండి ధరలు

ఆరోగ్యశ్రీ మాటున మోసం చేస్తే కఠిన చర్యలు

Read Latest Telangana News and National News

Updated Date - Jun 26 , 2025 | 08:51 AM