Share News

Hyderabad: పట్టపగలు.. మహిళను కట్టేసి..

ABN , Publish Date - May 03 , 2025 | 10:44 AM

పట్టపగలు.. మహిళను కట్టేసి బంగారు నగలు, నగదుతో ఉడాయించిన సంఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది. పార్శిగుట్టలో ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు వచ్చి ఇల్లు అద్దెకు కావాలంటూ వచ్చి ఒంటరిగా ఉన్న మహిళను బెదిరించి ఆమెను బెదిరించి బంగారం, నగదు చోరీ చేశారు.

Hyderabad: పట్టపగలు.. మహిళను కట్టేసి..

- బంగారం, నగదు చోరీ

- వారాసిగూడ పోలీస్‏స్టేషన్‌ పరిధిలో ఘటన

హైదరాబాద్: ఇల్లు అద్దెకు కావాలంటూ ఇంట్లోకి చొరబడిన ఇద్దరు అగంతుకులు ఓ మహిళను కట్టివేసి బంగారు నగలు, నగదు, సెల్‌ఫోన్‌ను దోచుకుని వెళ్లిన సంఘటన వారాసిగూడ పోలీస్‏స్టేషన్‌(Varasiguda) పరిధిలో జరిగింది. అడ్మిన్‌ ఎస్సై సుధాకర్‌, స్థానికుల వివరాల ప్రకారం.. పార్శిగుట్టలో పారిజాతం(56) అనే మహిళ ఇంట్లో మొదటి అంతస్తులో నివసిస్తోంది. శుక్రవారం మధ్యాహ్నం ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు ఇల్లు అద్దెకు కావాలంటూ ఇంట్లోకి చొరబడ్డారు.

ఈ వార్తను కూడా చదవండి: MLA: సీఎంగారూ.. తులం బంగారం ఎక్కడా..


తలుపులకు గడియపెట్టి, ఆమెను కత్తితో బెదిరించి టేపుతో కుర్చీలో కట్టివేశారు. ఇంట్లో ఉన్న ముప్పై గ్రాముల బంగారు నగలు, ఆరువేల నగదు, సెల్‌ఫోన్‌ తీసుకుని అక్కడి నుండి ఉడాయించారు. ఆ తర్వాత మహిళ కట్లను విప్పుకుని ఇంట్లో నుంచి కిందికి వచ్చి బోరున విలపిస్తూ స్థానికులకు విషయాన్ని తెలిపింది.


శుక్రవారం బాధితురాలు వారాసిగూడ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చిలకలగూడ ఏసీపీ జైపాల్‌రెడ్డి, ఇన్‌చార్జి ఇన్‌స్పెక్టర్‌ రమేష్ గౌడ్‌, అడ్మిన్‌ ఎస్సై సుధాకర్‌, డిటెక్టివ్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ప్రకాశ్‌రెడ్డి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితుల కోసం బృం దాలుగా ఏర్పడి గాలిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

Gold Rates Today: రెండో రోజు తగ్గిన బంగారం, వెండి ధరలు..ఇంకా తగ్గుతాయా..

Lift Irrigation: మళ్లీ సీడబ్ల్యూసీకి ‘పాలమూరు’ డీపీఆర్‌

Kishan Reddy: ఓల్డ్‌ సిటీకీ నిధులు కేటాయించాలి

పెద్దపల్లి ఎయిర్‌పోర్టు.. బసంత్‌నగర్‌లో కాదు.. అంతర్గాంలో!

Read Latest Telangana News and National News

Updated Date - May 03 , 2025 | 10:44 AM