Hyderabad: సాయం చేసేందుకు వెళ్లి..
ABN , Publish Date - May 09 , 2025 | 07:12 AM
మరణం ఏ రూపంలో వస్తుందో అంటే ఇదేనేమో.. సాయం చేసేందుకు వెళ్లిన ఓ యువకుడు దుర్మరణం పాలయిన విషాద సంఘటన ఇది. ఇన్నోవా కారుకు టైరు మార్చేందుకు సాయం చేసేందుకు వెళ్లిన ఓ వ్యక్తిని వేగంగా వచ్చిన కారు ఢీ కొట్టడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఆందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
- టైరు మారుస్తుండగా ఢీకొట్టిన కారు
- ఔటర్ ఎగ్జిట్ 17వద్ద ఘటన
హైదరాబాద్: అర్ధరాత్రి వేళ ఔటర్ రింగ్ రోడ్డు(Outer Ring Road)లో ఆగిపోయిన ఓ ఇన్నోవా కారుకు టైరు మార్చేందుకు సాయం చేసేందుకు వెళ్లిన ఓ వ్యక్తిని వేగంగా వచ్చిన కారు ఢీ కొట్టడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఈ సంఘటన బుధవారం అర్థరాత్రి 2:30 గంటల సమయంలో హిమాయత్‌సాగర్ ఔటర్ రింగ్ రోడ్డు(Himayatsagar Outer Ring Road) ఎగ్జిట్ 17వద్ద జరిగింది. వివరాలిలా ఉన్నాయి. చంచల్‌గూడ(Chanchalguda)కు చెందిన ఆజం అలీ తన కుటుంబసభ్యులతో కలిసి మహారాష్ట్ర లాతూర్‌లో జరిగిన శుభకార్యానికి వెళ్లి బుధవారం రాత్రి ఇన్నోవా కారులో తిరిగి వస్తున్నారు.
ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: అయ్యోపాపం.. ఎంత ఘోరం జరిగిందో..
నగర శివారులోని హిమాయత్‌సాగర్ ఔటర్ రింగ్‌రోడ్డు ఎగ్జిట్ 17 సమీపంలోకి వచ్చేసరికి కారు టైరు పగిలి ఆగిపోయింది. దీంతో ఆజం అలీ కుటుంబసభ్యులు మరో కారులోని వ్యక్తితో కలిసి సహాయం కోసం ఎదురుచూశారు. ఇంతలో ఆవలి రోడ్డులో ఓ రికవరీ వ్యాన్ వచ్చింది. ఇన్నోవా కారు టైర్ పగిలిపోయిందని తెలుసుకున్న వ్యాన్ డ్రైవర్ బోయిన మనోజ్‌కుమార్ (25) తన వద్ద ఉన్న జాక్‌తో సాయం చేసేందుకు వచ్చాడు.

టైరును మారుస్తుండగా గచ్చిబౌలి(Gachibowli) వైపు నుంచి వేగంగా వచ్చిన ఇతియోస్ కారు టీఎస్ 13ఎఫ్ బి5712 ఇన్నోవాను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో టైరు మారుస్తున్న సిద్దిపేట్ జిల్లా రుద్రారంనకు చెందిన మనోజ్‌కుమార్ అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ప్రమాదానికి కారణమైన కారును, డ్రైవర్ షేక్ మోహిద్‌ను రాజేంద్రనగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసును ఎస్‌ఐ భానుప్రకాశ్ దర్యాప్తు చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
Breaking News: భారత్-పాక్ యుద్ధంపై చైనా తాజా రియాక్షన్ ఇదే..
ToDay Gold Rates: పసిడి ప్రియులకు షాక్.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు..
మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ మసూద్ అజర్ చనిపోయాడా ..?
Operation Sindoor: యుద్ధ బీభత్సం
Read Latest Telangana News and National News