Share News

Indigo flight: ఇండిగో విమానం క్యాబిన్‌ క్రూ ఆత్మహత్య

ABN , Publish Date - Oct 29 , 2025 | 08:01 AM

ఇండిగో విమానంలో క్యాబిన్‌ క్రూ గా పనిచేస్తున్న జమ్మూకు చెందిన జాహ్నవి గుప్తా (25) ఈనెల 24న రాజేంద్రనగర్‌ పోలీస్‏స్టేషన్‌ పరిధిలో ఆత్మహత్య చేసుకుంది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ సంఘటన వివరాలు పోలీసులు, మృతురాలి తల్లి సోనిక గుప్తా వెల్లడించారు.

Indigo flight: ఇండిగో విమానం క్యాబిన్‌ క్రూ ఆత్మహత్య

హైదరాబాద్: ఇండిగో విమానంలో క్యాబిన్‌ క్రూ గా పనిచేస్తున్న జమ్మూకు చెందిన జాహ్నవి గుప్తా (25) ఈనెల 24న రాజేంద్రనగర్‌ పోలీస్‏స్టేషన్‌(Rajendranagar Police Station) పరిధిలో ఆత్మహత్య చేసుకుంది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ సంఘటన వివరాలు పోలీసులు, మృతురాలి తల్లి సోనిక గుప్తా వెల్లడించారు. జమ్మూకు చెందిన జాహ్నవి గుప్తా(Jahnavi Gupta) ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో క్యాబిన్‌ క్రూగా పనిచేస్తూ హైదరాబాద్‌(Hyderabad)లో ఉంటోంది. జనవరిలో భవానీ కాలనీలోని కెన్వర్త్‌ అపార్ట్‌మెంట్స్‌లోకి ఆమె మకాం మార్చింది.


mmmm.jpg

ఈనెల 24న జాహ్నవి గుప్తా తన స్నేహితులు, ఇండిగో విమానం కెప్టెన్‌ (యువతి), మరో ఉద్యోగితో కలసి తన ప్లాట్‌లో పార్టీ చేసుకున్నది. తెల్లవారు జామున 4గంటలకు జాహ్నవి తన గదిలోకి వెళ్లి ఎంతకు బయటకు రాలేదు. స్నేహితులు తలుపులు తోసుకొని వెళ్లి చూడగా ఆమె ఉరేసుకుని కనిపించింది. స్నేహితులు వెంటనే ఆమెను ఆస్పత్రికి తీసుకువెళ్లగా అప్పటికే మరణించిందని డాక్టర్లు ధ్రువీకరించారు. స్థానికుల సమాచారం మేరకు రాజేంద్రనగర్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


city3.2.jpg

ఈ వార్తలు కూడా చదవండి..

బంగారం ధరల్లో భారీగా తగ్గుదల

భయపెడుతున్న మొంథా తుఫాన్‌

Read Latest Telangana News and National News

Updated Date - Oct 29 , 2025 | 08:01 AM