Share News

Hyderabad: డిజిటల్‌ అరెస్టు పేరుతో బెదిరింపులు.. 2 కేసుల్లో ఏడుగురి అరెస్ట్‌

ABN , Publish Date - Feb 22 , 2025 | 10:42 AM

డిజిటల్‌ అరెస్టుల పేరుతో ఇద్దరి నుంచి రూ.1.66 కోట్ల మేర తమ ఖాతాలకు బదిలీ చేయించుకున్న ఏడుగురిని సైబరాబాద్‌ సైబర్‌ క్రైం పోలీసులు(Cyberabad Cyber ​​Crime Police) అరెస్ట్‌ చేశారు.

Hyderabad: డిజిటల్‌ అరెస్టు పేరుతో బెదిరింపులు.. 2 కేసుల్లో ఏడుగురి అరెస్ట్‌

- అందరూ కేరళ, తమిళనాడు రాష్ట్రాల వారే..

హైదరాబాద్‌ సిటీ: డిజిటల్‌ అరెస్టుల పేరుతో ఇద్దరి నుంచి రూ.1.66 కోట్ల మేర తమ ఖాతాలకు బదిలీ చేయించుకున్న ఏడుగురిని సైబరాబాద్‌ సైబర్‌ క్రైం పోలీసులు(Cyberabad Cyber ​​Crime Police) అరెస్ట్‌ చేశారు. బ్యాంకు ఖాతాల ఆధారంగా దర్యాప్తు చేపట్టి నిందితుల ఆట కట్టించారు. శుక్రవారం సైబరాబాద్‌ సైబర్‌ క్రైం విభాగం డీసీపీ శ్రీబాల ఆ కేసుల వివరాలను వెల్లడించారు. గతేడాది సెప్టెంబర్‌లో 82 ఏళ్ల రిటైర్డ్‌ ఇంజినీర్‌ను సైబర్‌ నేరగాళ్లు పథకం ప్రకారం డిజిటల్‌ అరెస్టు చేసి అతడి వద్ద నుంచి రూ.1.38 కోట్లను తమ అకౌంట్లలోకి బదిలీ చేయించుకున్నారు.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: స్వచ్ఛమైన గాలి.. అరగంటకు రూ.5 వేలు


సైబర్‌ నేరగాడు 99074 33363 నంబర్‌ నుంచి ఫోన్‌ చేసి ఎస్‌బీఐ ప్రతినిధిగా చెప్పుకున్నాడు. ‘మీపై యాంటీ మనీల్యాండరింగ్‌ కేసు నమోదైంది. మీరు వెంటనే ముంబయిలోని సైబర్‌ క్రైం ఆఫీసర్‌తో వాట్సాప్‌ నంబర్‌ 9912150357 ద్వారా మాట్లాడండి’ అని చెప్పాడు. బాధితుడు ఆనంబర్‌కు ఫోన్‌ చేయగా అవతలి వ్యక్తి భయపెట్టడంతో రూ.1.38 కోట్లను సైబర్‌ నేరగాళ్ల అకౌంట్లకు బదిలీ చేశాడు.


city3.2.jpg

తర్వాత మోసపోయానని గుర్తించిన బాధితుడు గతేడాది సెప్టెంబర్‌లో సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు మొదలు పెట్టారు. నగదు బదిలీ అయిన బ్యాంకు అకౌంట్లను పరిశీలించగా అవి తమిళనాడుకు చెందిన శంకర్‌ గణేష్ (46)కు చెందినవిగా గుర్తించారు. అతడికి ఇ.సత్యవేల్‌(45)తో పాటు జెస్మిన్‌ మోండల్‌, సచిన్‌, ముత్తుకుమార్‌, సలీం సహకరించినట్లు తెలుసుకున్నారు. వారిలో ఇద్దరిని అరెస్టు చేశారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారు.


మరో కేసులో ఐదుగురు..

జనవరిలో రిటైర్డ్‌ ప్రభుత్వ ఉద్యోగిని డిజిటల్‌ అరెస్టు పేరుతో బెదిరించి రూ.28.68 లక్షలు బదిలీ చేయించుకున్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు సైబరాబాద్‌ సైబర్‌ క్రైం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో బాధితురాలికి సైబర్‌ నేరగాళ్లు 9986159427 నంబరు నుంచి కాల్‌ చేసి మీ ఆధార్‌ కార్డును వినియోగించి ముంబయిలో ఎస్‌బీఐలో అకౌంట్‌ తెరిచి సుమారు రూ. 3 కోట్ల మేరకు మనీ ల్యాండరింగ్‌ కార్యకలాపాలకు పాల్పడ్డారని బెదిరించారు. ఈ కేసులో 3 నుంచి 7 ఏళ్ల జైలు శిక్ష పడుతుందని, రూ.50 లక్షల జరిమానా విధిస్తారని భయపెట్టారు. దీంతో ఆమె వారు కోరినట్లు రూ.28,68,504ను వారు చెప్పిన బ్యాంకు అకౌంట్లకు బదిలీ చేసింది.


ఆ తర్వాత మోసపోయానని గుర్తించి సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. సైబర్‌ నేరగాళ్లు కేరళ రాష్ట్రం నుంచి ఇదంతా చేశారని పోలీసులు గుర్తించారు. అక్కడికి వెళ్లి నిందితులు హంజా(44), ముస్తఫా(50), హెన్సిలీ జోసెఫ్‌(45), వి.పి.మణికందన్‌ (56), అసిఫ్‌ అలీ(34)ని అరెస్ట్‌ చేశారు. ప్రధాన నిందితుడు బాబు పరారీలో ఉన్నాడు. నిందితుల నుంచి నాలుగు మొబైల్‌ ఫోన్‌లు, ఐదు పాస్‌పుస్తకాలు, మూడు బ్యాంకు చెక్కు బుక్‌లు, ఏడు డెబిట్‌ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఏ2గా ఉన్న హంజా, ఏ-1గా ఉన్న బాబు అనే వ్యక్తికి 30కిపైగా బ్యాంకు అకౌంట్లను సరఫరా చేసినట్లు పోలీసులు దర్యాప్తులో గుర్తించారు.


ఈవార్తను కూడా చదవండి: Hyderabad: పర్యాటకానికి అందం

ఈవార్తను కూడా చదవండి: Medak: రేవంత్‌ మాటలు కోటలు దాటుతున్నాయి

ఈవార్తను కూడా చదవండి: LRS: ఎల్‌ఆర్‌ఎస్‌ ఫీజు నిర్ధారణ!

ఈవార్తను కూడా చదవండి: BJP.. కేసీఆర్ పాలనలోనే ఆర్థిక వ్యవస్థ కొల్లగొట్టారు

Read Latest Telangana News and National News

Updated Date - Feb 22 , 2025 | 10:42 AM