Hyderabad: డిజిటల్ అరెస్ట్ పేరుతో బెదిరించి రూ.2.53 లక్షలు కొట్టేశారుగా..
ABN , Publish Date - Jan 30 , 2025 | 11:22 AM
మీ పేరుతో ఉన్న పార్సిల్‌లో డ్రగ్స్ ఉన్నాయని ప్రారంభించి, మనీ లాండరింగ్ కేసుల పేరు చెప్పి, 9 రోజుల పాటు డిజిటల్ అరెస్ట్ అంటూ భయపెట్టిన సైబర్ నేరగాళ్లు(Cyber criminals) నగరవాసి నుంచి రూ.2.53 లక్షలు దోచేశారు. నగరానికి చెందిన వ్యక్తి(30)కి ఆటోమేటెడ్ కాల్ వచ్చింది.

హైదరాబాద్ సిటీ: మీ పేరుతో ఉన్న పార్సిల్‌లో డ్రగ్స్ ఉన్నాయని ప్రారంభించి, మనీ లాండరింగ్ కేసుల పేరు చెప్పి, 9 రోజుల పాటు డిజిటల్ అరెస్ట్ అంటూ భయపెట్టిన సైబర్ నేరగాళ్లు(Cyber criminals) నగరవాసి నుంచి రూ.2.53 లక్షలు దోచేశారు. నగరానికి చెందిన వ్యక్తి(30)కి ఆటోమేటెడ్ కాల్ వచ్చింది. డీహెచ్‌ఎల్ నుంచి సంప్రదిస్తున్నామని, మీ పార్సిల్ రిజెక్ట్ అయిందని రికార్డెడ్ వాయిస్ వచ్చింది. వివరాల కోసం 1కి డయల్ చేయాలని సూచన రావడంతో, బాధితుడు 1 నొక్కాడు. డీహెచ్‌ఎల్ ప్రతినిధి అని పరిచయం చేసుకున్న అవతలి వ్యక్తి.. మీ పేరున ముంబై నుంచి దుబాయ్ వెళ్లే పార్సిల్‌లో ఎండీఎంఏ డ్రగ్ లభ్యమైందని, పోలీసులు విచారణ చేస్తున్నారని చెప్పాడు.
డ
ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: అఫ్జల్‌గంజ్‌లో కాల్పులకు పాల్పడిన బిహార్ గ్యాంగ్‌పై రూ. 4 లక్షల రివార్డు
పోలీసులతో సంప్రదించమంటూ ఫోన్ కలిపాడు. ముంబై పోలీస్ అధికారినంటూ పరిచయం చేసుకున్న మరోవ్యక్తి మీ ఆధార్ నంబర్(Aadhaar number), వివరాలతో ముంబై అంధేరి బ్యాంక్‌లో ఖాతా ఉందని, ఈ ఖాతా నుంచి విదేశాలకు డబ్బు మళ్లించారని చెప్పాడు. మనీ లాండరింగ్ కేసులో అరెస్టయిన వ్యక్తి వద్ద మీ ఏటీఎం కార్డు ఉందని, అందువల్లే అనుమానితుడి కింద కేసు నమోదు చేశామని చెప్పాడు. తనకు పార్సిల్‌కు, బ్యాంక్ ఖాతాలకు ఎలాంటి సంబంధం లేదని బాధితుడు చెప్పినప్పటికీ సైబర్ నేరగాడు వినిపించుకోలేదు. కేసు దర్యాప్తులో భాగంగా డిజిటల్ అరెస్ట్ అంటూ భయపెట్టిన నేరగాడు, అతడి బ్యాంకు ఖాతాల వివరాలు తీసుకున్నాడు.
9 రోజుల పాటు విచారణ పేరుతో భయపెట్టి రూ.2.53 లక్షలు తమ ఖాతాల్లో జమ చేయించుకున్నాడు. కేసు దర్యాప్తు గురించి ఇతరులకు చెప్పకూడదని, ఇది దేశ రహస్యాలకు సంబంధించినదని చెప్పాడు. దర్యాప్తు గురించి ఇతరులతో చెబితే జైలు శిక్షతోపాటు రూ.5 లక్షల జరిమానా ఉంటుందని భయపెట్టాడు. అంతేకాకుండా బాధితుడి పేరుతో పర్సనల్ లోన్ తీయించే ప్రయత్నం చేశాడు. లోన్ రాకపోవడంతో సైబర్ నేరగాళ్లు ఫోన్ చేయడం మానేశారు. డబ్బు తిరిగి జమ కాకపోవడంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు సైబర్ క్రైం ఠాణాలో ఫిర్యాదు చేశాడు. కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఈవార్తను కూడా చదవండి: Hyderabad: అవిశ్వాసంపై మాట్లాడొద్దు..
ఈవార్తను కూడా చదవండి: Khairatabad: అమెరికాలో రోడ్డు ప్రమాదం హైదరాబాద్ వాసి మృతి
ఈవార్తను కూడా చదవండి: ఆ రోజు నుంచే ప్రభుత్వ పథకాల జాతర: భట్టి విక్రమార్క..
ఈవార్తను కూడా చదవండి: High Alert: హై అలర్ట్‌గా తెలంగాణ ఛత్తీస్‌గడ్ సరిహద్దు..
Read Latest Telangana News and National News