Hyderabad: అఫ్జల్‌గంజ్‌లో కాల్పులకు పాల్పడిన బిహార్ గ్యాంగ్‌పై రూ. 4 లక్షల రివార్డు
ABN , Publish Date - Jan 30 , 2025 | 10:57 AM
బీదర్(Bidar)లో ఏటీఎంలో పెట్టాల్సిన రూ. 93 లక్షలు దోపిడీ చేసి.. అఫ్జల్‌గంజ్(Afzalganj)లో కాల్పులు జరిపిన ఘరానా బిహార్ దొంగలు అమిత్, మనీష్ గ్యాంగ్ కోసం తెలంగాణ, కర్ణాటక, బిహార్, యూపీ రాష్ట్రాల పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.
- నిందితుల కోసం నాలుగు రాష్ట్రాల పోలీసుల గాలింపు
హైదరాబాద్ సిటీ: బీదర్(Bidar)లో ఏటీఎంలో పెట్టాల్సిన రూ. 93 లక్షలు దోపిడీ చేసి.. అఫ్జల్‌గంజ్(Afzalganj)లో కాల్పులు జరిపిన ఘరానా బిహార్ దొంగలు అమిత్, మనీష్ గ్యాంగ్ కోసం తెలంగాణ, కర్ణాటక, బిహార్, యూపీ రాష్ట్రాల పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. దేశవ్యాప్తంగా పదుల సంఖ్యలో దోపిడీలు, దొంగతనాలు, హత్యలకు పాల్పడినట్లు గుర్తించిన ఈ ముఠాపై యూపీ పోలీసులు రూ. 4లక్షల రివార్డు ప్రకటించినట్లు సీపీ సీవీ ఆనంద్ తెలిపారు.
ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: ఆ ప్రాంతమంతా భయానకం.. గంటలోపే పెద్దఎత్తున తొక్కిసలాట జరిగింది
అర్ధరాత్రి వరకు నగరంలోనే..
బీదర్ నుంచి నగదుతో పారిపోయి నగరానికి వచ్చిన నిందితులు రోషన్ ట్రావెల్స్ బస్సులో ఛత్తీస్ గఢ్ మీదుగా బిహార్(Bihar) వెళ్లాలనుకున్నారు. బస్సులో ట్రావెల్స్ ఉద్యోగి బ్యాగులు తనిఖీ చేస్తుండగా.. తాము కాజేసిన డబ్బు ఎక్కడ బయటపడుతుందోనని భావించి అతడిపై కాల్పులు జరిపి అక్కడి నుంచి ఆటోలో పారిపోయారు. సికింద్రాబాద్ వరకు ఆటోలో వెళ్లిన దుండగులు ఆ తర్వాత కనిపించలేదు.

పోలీసులు 10 ప్రత్యేక బృందాలను రంగంలోకి దిగి గాలింపు చేపట్టినా నిందితుల జాడ లభించలేదు. సీసీటీవీ కెమెరాలను జల్లెడపట్టగా.. నిందితులు గంటల తరబడి నగరంలోనే ఉండి, తర్వాత తిరుమలగిరి నుంచి మియాపూర్ వెళ్లి, అక్కడి నుంచి కూకట్‌పల్లి వచ్చి అర్ధరాత్రి సమయంలో ప్రైవేట్ ట్రాన్స్‌పోర్టులో చిత్తూరు వెళ్లినట్లు గుర్తించారు. ఘరానా దొంగలకు సంబంఽధించి పలు ఆధారాలు లభించాయని, త్వరలోనే ఆ ముఠాను పట్టుకుంటామని సీపీ పేర్కొన్నారు.
ఈవార్తను కూడా చదవండి: Hyderabad: అవిశ్వాసంపై మాట్లాడొద్దు..
ఈవార్తను కూడా చదవండి: Khairatabad: అమెరికాలో రోడ్డు ప్రమాదం హైదరాబాద్ వాసి మృతి
ఈవార్తను కూడా చదవండి: ఆ రోజు నుంచే ప్రభుత్వ పథకాల జాతర: భట్టి విక్రమార్క..
ఈవార్తను కూడా చదవండి: High Alert: హై అలర్ట్‌గా తెలంగాణ ఛత్తీస్‌గడ్ సరిహద్దు..
Read Latest Telangana News and National News