Hyderabad: ఆ ప్రాంతమంతా భయానకం.. గంటలోపే పెద్దఎత్తున తొక్కిసలాట జరిగింది
ABN , Publish Date - Jan 30 , 2025 | 10:32 AM
‘బుధవారం తెల్లవారు జామున 3.30 గంటలకు త్రివేణి సంగమం ఘాట్(Triveni Sangam Ghat) వద్ద స్నానాలు ఆచరించి బయటకు వచ్చాం. గంట తర్వాత పెద్ద అలజడి రేగింది. ఏమి జరిగిందో తెలియదు.

- మేము స్నానాలు చేసేటప్పుడు ప్రశాంతంగా ఉంది
- కుంభమేళా ఘటనలో క్షేమంగా బయటపడ్డ నగర పూజారి
హైదరాబాద్: ‘బుధవారం తెల్లవారు జామున 3.30 గంటలకు త్రివేణి సంగమం ఘాట్(Triveni Sangam Ghat) వద్ద స్నానాలు ఆచరించి బయటకు వచ్చాం. గంట తర్వాత పెద్ద అలజడి రేగింది. ఏమి జరిగిందో తెలియదు. అంతా గందరగోళం, భయానకం. పోలీసులు అందరినీ స్నానాలఘాట్ నుంచి బయటకు పంపిచేస్తున్నారు. ఉరుకులు, పరుగులు పెడుతున్నారు. మేము భయపడి ఎలాగొలా విడిది వద్దకు చేరుకున్నాం. ఏదో జరిగిందని అందరూ భయపడుతున్నారు. పెద్ద ఎత్తున తొక్కిసలాట జరిగింది.
ఈ వార్తను కూడా చదవండి: Water Bill: నెల నల్లా.. వెయ్యికి పైగానే
చాలామంది భక్తులు గాయపడ్డారు అని తెలిసింది. అక్కడ ఉండేందుకు భయపడి తిరుగు ప్రయాణం అయ్యాం’ అని ప్రయాగ్‌రాజ్‌లో త్రుటిలో అపాయం నుంచి బయటపడ్డ మేడ్చల్(Medchal) జిల్లా జవహర్‌నగర్ మార్కెండేయస్వామి ఆలయ పూజారి నాగభూషణం శర్మ చెప్పారు. ఈ సందర్భంగా ఆయన ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడుతూ.. ‘నలుగురం బంధువులం కలిసి మూడు రోజులక్రితం కుంభమేళాకు వెళ్లాం. బుధవారం ఉదయం స్నానాలు చేసి వచ్చిన గంటలోపే ప్రమాదం జరిగింది. అధిక సంఖ్యలో భక్తులు మృతి చెందడం బాధకలిగించిందని తెలిపారు. యువకులు పెద్దగా అరవటం తొక్కిసలాటకు కారణమైనట్లు మాకు తెలిసిన సమాచారం’ అని నాగభూషణం శర్మ ఫోన్‌లో చెప్పారు.
నార్సింగ్ వాసులు క్షేమం..
నార్సింగ్: మహాకుంభ మేళాకు వెళ్లిన నార్సింగ్ వాసులు క్షేమంగానే ఉన్నారు. తొక్కిసలాట జరిగిన మహదేవ్‌ఘాట్ వద్దనే వారు స్నానాలు ఆచరించారు. ఆ సమయంలో అక్కడే పార్కింగ్‌లో ఉన్నామని కొల్లూరు ప్రభాకర్, సత్యనారాయణ యాదవ్, మహేందర్‌గౌడ్, కిరణ్‌కుమార్, సునీల్, రాజు, శివారెడ్డి, తిరుమలేశ్ ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. విపరీతమైన రద్దీ ఉన్నా తాము ఇబ్బంది పడలేదని, తొక్కిసలాట బాధ కలిగించిందని కొల్లూరు కిరణ్, మహేందర్‌గౌడ్ అన్నారు. 17 మంది స్నేహితులం కుంభమేళాకు వెళ్లామన్నారు. అక్కడ గండిపేట మండలానికి చెందిన వారు 100 మందికిపైగా ఉన్నారని కిరణ్ చెప్పారు. తొక్కిసలాట జరిగినప్పుడు మనవారు ఎవరూ లేరని తెలియడంతో ఊపిరి పీల్చుకున్నామన్నారు. వీరు బుధవారం మధ్యప్రదేశ్ మీదుగా ప్రత్యేక బస్సులో హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమయ్యారు.
ఈవార్తను కూడా చదవండి: Hyderabad: అవిశ్వాసంపై మాట్లాడొద్దు..
ఈవార్తను కూడా చదవండి: Khairatabad: అమెరికాలో రోడ్డు ప్రమాదం హైదరాబాద్ వాసి మృతి
ఈవార్తను కూడా చదవండి: ఆ రోజు నుంచే ప్రభుత్వ పథకాల జాతర: భట్టి విక్రమార్క..
ఈవార్తను కూడా చదవండి: High Alert: హై అలర్ట్‌గా తెలంగాణ ఛత్తీస్‌గడ్ సరిహద్దు..
Read Latest Telangana News and National News