Hyderabad: పెళ్లి చేసుకుంటానని నమ్మించి..
ABN , Publish Date - May 22 , 2025 | 08:14 AM
పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ యువతిని శారీరకంగా అనుభవించి మోసానికి పాల్పడ్డ వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పసుపులేటి అచ్యుత్ అనే యువకుడు ఓ యువతిని పెళ్లిచేసుకుంటానని నమ్మించాడు. అనంతరం ఆమెతో శారీరకంగా అనుభవించి గర్భవతిని చేసి పలుమార్లు అబార్ష్‌న్ చేయించాడు.
- గర్భం దాల్చిన యువతికి పలుమార్లు అబార్షన్
- పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు, కేసు నమోదు
హైదరాబాద్: పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసిన వ్యక్తిపై కేసు నమోదైంది. గర్భవతిని చేసి పలు మార్లు అబార్ష్‌న్ చేయించాడు. యువతి అనారోగ్యం బారినపడగా అందం తగ్గిందని పెళ్లి చేసుకునేందుకు నిరాకరించాడు. మోసపోయానని గ్రహిం చిన యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాల్లోకి వెళితే... నగరంలోని ఫిలింనగర్(Film Nagar)లో ఉంటున్న యువతి ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తుంది.
ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: రూ.లక్షకు లక్షాముప్పై వేలు..
2023లో పసుపులేటి అచ్యుత్ ఆ సంస్థలో ఉద్యోగంలో చేరాడు. ఇన్‌స్టా గ్రామ్ ద్వారా పరిచయం చేసుకుని ప్రేమిస్తున్నా, పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో నమ్మింది. దాంతో ఇద్దరు సహజీవనం ప్రారంభించగా, సెప్టెంబర్‌లో యువతి గర్భం దాల్చింది. ఇదే విషయాన్ని అచ్యుత్‌కు చెప్పగా అబార్షన్ కావడానికి మందులు తెచ్చి ఇచ్చాడు. ఇలా గర్భం దాల్చిన పలుమార్లు అబార్షన్ కావడానికి ముందులు ఇవ్వడంతో యువతి అనారోగ్యానికి గురి అయింది.
జరిగిన విషయాన్ని బాధితురాలు అచ్యుత్ తల్లి, కుటుంబ సభ్యులకు, ఇద్దరికి కామన్ స్నేహితులైన కావ్వ, ఆదిత్యకు చెప్పారు. ఎవరూ పట్టించుకోక పోవడంతో మోసపోయానిని గ్రహించిన బాధితు రాలు ఈ నెల 20న ఫిలింనగర్ పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేయగా, బీఎన్‌ఎస్ 69,79,89, 351(3) సెక్షన్‌ల కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి.
Gold Rates Today: భారీ షాక్ ఇచ్చిన బంగారం, వెండి ధరలు.. చివరకు..
Kaleshwaram: కాళేశ్వరం బ్యారేజీల మరమ్మతు ప్రణాళికలేవి
BJP National President K Laxman: వ్యవస్థలో మార్పే అసలైన పరీక్ష
Asaduddin Owaisi: వక్ఫ్ చట్టాన్ని వెనక్కి తీసుకోవాల్సిందే
Kaleshwaram Pushkaralu: భక్తజన సంద్రం.. త్రివేణీ సంగమం
Read Latest Telangana News and National News