Share News

Hyderabad: చిన్నారుల కొనుగోలు కేసులో కిలేడీ అరెస్టు..

ABN , Publish Date - Mar 08 , 2025 | 10:00 AM

ముక్కుపచ్చలారని చిన్నారులను కొనుగోలు చేసి వేరే రాష్ట్రాల్లో విక్రయిస్తున్న ఘరానా లేడీని పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. గుజరాత్ రాష్ట్రానికి చెందిన ఆ ‘లేడీ’ని రాచకొండ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.

Hyderabad: చిన్నారుల కొనుగోలు కేసులో కిలేడీ అరెస్టు..

హైదరాబాద్‌ సిటీ: పొత్తిళ్లలో ఉన్న చిన్నారులను కొనుగోలు చేసి, రాష్ట్రాలు దాటించి విక్రయిస్తున్న కేసులో పరారీలో ఉన్న గుజరాత్‌(Gujarath) కిలేడీ వందన(Vandana)ను రెండు రోజుల క్రితం అరెస్టు చేసి రాచకొండ పోలీసులు(Rachakonda Police) రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులో నగరంలో కింగ్‌పిన్‌గా వ్యహరిస్తున్న కృష్ణవేణితో పాటు.. ఆమెకు సహకరించిన మొత్తం 14 మందిని అరెస్టు చేశారు.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: పగలు భగ.. భగ.. రాత్రి చలి.. నగరంలో భిన్న వాతావరణం


పోలీసుల కస్టడీ పిటిషన్‌..

రెండు తెలుగు రాష్ట్రాల్లో చిన్నారులను విక్రయించే కృష్ణవేణికి, గుజరాత్‌ కేంద్రంగా చిన్నారులను అక్రమ రవాణా చేస్తున్న వందనకు దేశవ్యాప్తంగా నెట్‌వర్క్‌(Network) ఉన్నట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో ఇద్దరు ప్రధాన నిందితులను పోలీస్‌ కస్టడీకి ఇవ్వాల్సిందిగా న్యాయస్థానంలో రాచకొండ పోలీసులు పిటిషన్‌ దాఖలు చేశారు.


city5.2.jpg

నిందితులను పోలీస్‌ కస్టడీకి తీసుకొని విచారిస్తే వారు ఎన్నేళ్లుగా చిన్నారుల అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు..? ఇప్పటి వరకు ఎంతమంది చిన్నారులను కొనుగోలు చేశారనే పూర్తి వివరాలు వెలుగులోకి వచ్చే అవకాఽశం ఉందని పోలీసులు పేర్కొన్నారు. నిందితులను సోమవారం పోలీస్‌ కస్టడీకి ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలిసింది.


ఈ వార్తను కూడా చదవండి: తుర్లపాటి రాజేశ్వరికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం

ఈ వార్తను కూడా చదవండి: హైదరాబాద్‌లో చిన్నారిపై వీధి కుక్కల దాడి

ఈ వార్తను కూడా చదవండి: ఎకరా టార్గెట్‌ 100 కోట్లు!

ఈ వార్తను కూడా చదవండి: ఖమ్మం జిల్లాలో చిరుతపులి సంచారం కలకలం..

Read Latest Telangana News and National News

Updated Date - Mar 08 , 2025 | 10:00 AM