Share News

Hyderabad: పగలు భగ.. భగ.. రాత్రి చలి.. నగరంలో భిన్న వాతావరణం

ABN , Publish Date - Mar 08 , 2025 | 09:08 AM

హైదరాబాద్‌ నగరంలో భిన్న వాతావరణం నెలకొంది. పగలు ఎండ, రాత్రిపూట చలి.. ఇలా.. భిన్న వాతావరణంతో ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. వాతావరణంలో ఏర్పడుతున్న మార్పుల వల్ల ఈ పరిస్థితి నెలకొంటుందని సంభందిత విభాగం వారు తెలుపుతున్నా.. ప్రజల్లో మాత్రం ఒకింత ఆందోళన, ఆశ్చర్యం వ్యక్తమవుతోంది.

Hyderabad: పగలు భగ.. భగ.. రాత్రి చలి.. నగరంలో భిన్న వాతావరణం

- మధ్యాహ్నం 35.6 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు

- రాత్రిసమయంలో పటాన్‌చెరులో 10.2 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు

హైదరాబాద్‌ సిటీ: భానుడి భగ భగతో ప్రజలు అల్లాడిపోతున్న నగరవాసులు రాత్రిపూట చలితో ఇబ్బంది పడుతున్నారు. శుక్రవారం హైదరాబాద్‌లో పగలు 35.6 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవగా, పటాన్‌చెరు(Patancheru)) ప్రాంతంలో రాత్రిపూట అత్యల్పంగా కనిష్ఠ ఉషోగ్రతలు 10.2, రాజేంద్రనగర్‌లో 11 డిగ్రీలు నమోదయ్యాయి. రాత్రి సమయంలో ఉత్తర, ఈశాన్య దిశగా వీస్తున్న గాలుల ప్రభావంతో పలు ప్రాంతాల్లో 10-16 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

ఈ వార్తను కూడా చదవండి: Cyber ​​crime: నకిలీ వివరాలతో బ్యాంకుల్లో ఖాతాలు తెరిచి..


city4.jpg

రాత్రి సమయంలో దుండిగల్‌-15.4, బేగంపేట(Begampet)- 16.2, హకీంపేట- 19.4 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరో రెండురోజుల పాటు నగరంలో ఇదే తరహా వాతావరణం కొనసాగుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉపరితల గాలులు తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి గంటకు 2-6 కిలోమీటర్ల వేగంతో వీస్తున్నాయని పేర్కొన్నారు. 9వ తేదీ తర్వాత పగటి ఉష్ణోగ్రతలు 1-2 డిగ్రీలు పెరుగుతాయన్నారు.


ఈ వార్తను కూడా చదవండి: తుర్లపాటి రాజేశ్వరికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం

ఈ వార్తను కూడా చదవండి: హైదరాబాద్‌లో చిన్నారిపై వీధి కుక్కల దాడి

ఈ వార్తను కూడా చదవండి: ఎకరా టార్గెట్‌ 100 కోట్లు!

ఈ వార్తను కూడా చదవండి: ఖమ్మం జిల్లాలో చిరుతపులి సంచారం కలకలం..

Read Latest Telangana News and National News

Updated Date - Mar 08 , 2025 | 09:08 AM