Share News

AP News: తిరుమల ఏటీఎంలో కర్ణాటక వాసి హంగామా

ABN , Publish Date - Aug 20 , 2025 | 10:52 AM

తిరుమలలోని యూనియన్‌ బ్యాంక్‌ ఏటీఎంలో సోమవారం రాత్రి ఒక వ్యక్తి సీసీ కెమెరాలు ధ్వంసం చేసి నానా హంగామా స్పష్టించాడు. రాత్రి 11.30 గంటల సమయంలో వైకుంఠం క్యూకాంప్లెక్స్‌ ముందున్న ఏటీఎంలోకి ప్రవేశించిన అతడు పలుచోట్ల వైర్లను కట్‌ చేశాడు. అనంతరం ఏటీఎం మిషన్‌ చుట్టూ అనుమానాస్పదంగా తిరిగాడు.

AP News: తిరుమల ఏటీఎంలో కర్ణాటక వాసి హంగామా

తిరుమల: తిరుమల(Tirumala)లోని యూనియన్‌ బ్యాంక్‌ ఏటీఎంలో సోమవారం రాత్రి ఒక వ్యక్తి సీసీ కెమెరాలు ధ్వంసం చేసి నానా హంగామా స్పష్టించాడు. రాత్రి 11.30 గంటల సమయంలో వైకుంఠం క్యూకాంప్లెక్స్‌ ముందున్న ఏటీఎంలోకి ప్రవేశించిన అతడు పలుచోట్ల వైర్లను కట్‌ చేశాడు. అనంతరం ఏటీఎం మిషన్‌(ATM Mission) చుట్టూ అనుమానాస్పదంగా తిరిగాడు.


nani3.2.jfif

ఈ దృశ్యాలన్నీ మరో సీసీ కెమెరాలో రికార్డు కావడంతో బ్యాంక్‌ అధికారులు తిరుమల టూటౌన్‌ పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు మంగళవారం ఉదయం కల్యాణకట్ట వద్ద అతడిని అదుపులోకి తీసుకుని విచారించారు. కర్ణాటకకు చెందిన ప్రవీణ్‌కుమార్‌గా గుర్తించామని, మానసిక స్థితి సరిగాలేదని సీఐ శ్రీరాముడు తెలిపారు. అయినప్పటికీ గతంలో ఏవైౖనా నేరాలకు పాల్పడ్డాడా అనే కోణంలోనూ విచారిస్తున్నామన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు...

‘కన్ఫర్డ్‌’లుగా 17 మంది సిఫారసు!

విద్యుత్‌ స్తంభాలపై కేబుల్‌ వైర్లను తీసేయండి

Read Latest Telangana News and National News

Updated Date - Aug 20 , 2025 | 10:52 AM