Share News

Hyderabad: వాట్సాప్‏లో వల.. చిక్కితే విలవిల

ABN , Publish Date - May 03 , 2025 | 09:41 AM

సైబర్‌ నేరగాళ్లు రూటు మార్చి రెచ్చిపోతున్నారు. వాట్సాప్ ద్వారా మెసెజ్లు‏ పెడుతూ.. బురిడీ కొట్టేస్తున్నారు. ఈ మెసజ్‏లకు స్పందిస్తే.. ఇక అంతే సంగతులు. మన బ్యాంకు ఖాతా వివరాలు తెలుసుకోవడం ద్వారా డబ్బులన్నీ లాగేసుకుంటున్నారు. ఈ నయా దందాకు సంబంధించిన పూర్తి వివరాలిలా ఉన్నాయి.

Hyderabad: వాట్సాప్‏లో వల.. చిక్కితే విలవిల

- గ్రూపుల్లో లాభాల పేరిట ప్రచారం.. పెట్టుబడులు పెట్టేలా ప్రలోభం

- అత్యాశకు పోతే అసలుకే మోసం.. అప్రమత్తంగా ఉండాలంటున్న నిపుణులు

హైదరాబాద్‌ సిటీ: ‘తక్కువ సమయంలో మీ పెట్టుబడికి అధిక లాభాలు’ అని ఊరించే ఆకర్షణీయమైన పోస్టులు వాట్సాప్‌(WhatsApp) గ్రూపుల్లో విస్తృతంగా వైరల్‌ అవుతున్నాయి. నమ్మి ఎవరైనా పెట్టుబడులు పెట్టారా మోసపోవడం ఖాయమని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ప్రజల ప్రధాన వీక్‌నెస్‏లో ఒకటైన డబ్బు సంపాదనను ఆసరాగా చేసుకుని సైబర్‌ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఇప్పటికే వర్క్‌ ఫ్రమ్‌ హోం పేరుతో ఎంతో మంది మోసపోయిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. తాజాగా బ్యాంకుల్లో డబ్బులు ఉన్న వారినే లక్ష్యంగా చేసుకొని పెట్టుబడుల పేరుతో ఎర వేస్తున్నారు.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: మాట్లాడుదామని షాపునుంచి బయటకు పిలిచి..


అధిక లాభాలంటూ ఆశ

అధిక లాభాల పేరుతో పెద్ద పెద్ద కంపెనీల పేర్లు, లోగోలతో వాట్సప్‌ గ్రూపుల్లో పోస్టులు పెడతారు. వెంటనే పెట్టుబడి పెట్టకపోతే మంచి అవకాశం కోల్పోతారని ప్రలోభ పెడతారు. వారితో కనెక్ట్‌ అయితే నమ్మకం కలిగేలా మాట్లాడతారు. పెట్టుబడులు పెట్టి చాలా మంది ధనవంతులు అయ్యారని కొన్ని ఫేక్‌ ఉదాహరణలు చూపెడతారు. మీతో పరిచయం లేని వ్యక్తులు ఈ తరహా సంభాషణలు చేస్తున్నారంటే అప్రమత్తంగా ఉండాల్సిందే. సరైన విచారణ చేపట్టకుండా వారు చెప్పినట్లు పెట్టుబడులు స్టాక్‌ మార్కెట్‌ గ్రూపులే ఎక్కువ


city4.2.jpg

వాట్సాప్ లోని అనేక గ్రూపుల్లో స్టాక్‌ మార్కెట్‌, మ్యూచువల్‌ ఫండ్స్‌, క్రిప్టో కరెన్సీ వంటి పెట్టుబడి అవకాశాల గురించి చర్చిస్తారు. కొన్ని నిజమైన సమాచారాన్ని అందిస్తే, మెజారిటీ గ్రూపులు ఉద్దేశ్యపూర్వకంగానే తప్పుదారి పట్టించేలా ఉంటాయి. ఆకర్షణీయమైన ఆఫర్లు వస్తుంటే అవి మోసపూరిత పథకాలు అని గుర్తించాలి. పెడితే కష్టార్జితం మోసగాళ్ల పాలు కావడం ఖాయం. పెట్టుబడులు పెట్టి నష్టపోతున్న వారిలో ఎక్కువగా విశ్రాంత ఉద్యోగులు, గృహిణులు, సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు, నిరుద్యోగులు.. ఇలా చదువుకున్న వారే ఉంటున్నారని పోలీసు రికార్డులు చెబుతున్నాయి.


నిపుణులు ఏం చెబుతున్నారంటే..

- కంపెనీ లేదా స్కీమ్‌ గురించి పూర్తి సమాచారం సేకరించిన తర్వాతే పెట్టుబడి పెట్టాలి.

- లాభాలు ఆశించే వారు కచ్చితంగా ధృవీకరించిన ఆర్థిక సలహాదారులను సంప్రదించాలి.

- ఆఫర్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి.

- మోసపూరిత కార్యకలాపాల కోసమే ఎక్కువ సంఖ్యలో వాట్సాప్‌ గ్రూపులు, చానల్స్‌ ఏర్పాటవుతున్నాయి. గ్రూపుల్లో చేరకపోవడమే మంచిదని గ్రహించాలి.


ఈ వార్తలు కూడా చదవండి

Gold Rates Today: రెండో రోజు తగ్గిన బంగారం, వెండి ధరలు..ఇంకా తగ్గుతాయా..

Lift Irrigation: మళ్లీ సీడబ్ల్యూసీకి ‘పాలమూరు’ డీపీఆర్‌

Kishan Reddy: ఓల్డ్‌ సిటీకీ నిధులు కేటాయించాలి

పెద్దపల్లి ఎయిర్‌పోర్టు.. బసంత్‌నగర్‌లో కాదు.. అంతర్గాంలో!

Read Latest Telangana News and National News

Updated Date - May 03 , 2025 | 09:41 AM