Share News

Hyderabad: జలమండలి అధికారి పేరిట వృద్ధుడికి టోకరా.. రూ.2.30 లక్షలు గోవిందా..

ABN , Publish Date - Nov 21 , 2025 | 06:48 AM

జలమండలి అధికారి పేరిట ఓ సైబర్‌ నేరగాడు ఓ వృద్ధుడి నుంచి రూ.2.30 లక్షలు కాజేశాడు. చిలకలగూడ పోలీసుల కథనం ప్రకారం.. సీతాఫల్‌మండికి చెందిన రిటైర్డ్‌ ప్రభుతోద్యోగికి వాటర్‌ బోర్డు నుంచి నీటి బిల్లు వెరిఫికేషన్‌ కోసమంటూ ఓ అగంతకుడు ఈనెల 15వ తేదీన పలుమార్లు కాల్‌ చేశాడు.

Hyderabad: జలమండలి అధికారి పేరిట వృద్ధుడికి టోకరా.. రూ.2.30 లక్షలు గోవిందా..

- రూ.2.30 లక్షలు స్వాహా.. పోలీసులను ఆశ్రయించిన బాధితుడు

హైదరాబాద్: జలమండలి అధికారి పేరిట ఓ సైబర్‌ నేరగాడు ఓ వృద్ధుడి నుంచి రూ.2.30 లక్షలు కాజేశాడు. చిలకలగూడ పోలీసుల(Chilakalguda Police) కథనం ప్రకారం.. సీతాఫల్‌మండికి చెందిన రిటైర్డ్‌ ప్రభుతోద్యోగికి వాటర్‌ బోర్డు నుంచి నీటి బిల్లు వెరిఫికేషన్‌ కోసమంటూ ఓ అగంతకుడు ఈనెల 15వ తేదీన పలుమార్లు కాల్‌ చేశాడు. వినియోగదారు అకౌంట్‌ నంబర్‌ (కేన్‌) పాతది అయిపోయిందని, కొత్తది తీసుకోకపోతే నీటి సరఫరా బంద్‌ అవుతుందని నమ్మించాడు.


city1.2.jpg

ఆయన ఫోన్‌కు వాటర్‌బిల్లు పేరిట ఏపీకే ఫైల్‌ పంపించి ఇన్‌స్టాల్‌ చేయించాడు. వెంటనే రూ.2.30 లక్షలు విత్‌డ్రా(Withdrawal) అయినట్లు ఈతడి ఫోన్‌కు మెసేజ్‌ వచ్చింది. మోసపోయినట్లు భావించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ డబ్బు ధీరజ్‌కుమార్‌, రాజు ఖాతాలకు వెళ్లినట్లు గుర్తించిన పోలీసులు ఆ ఖాతాలను సీజ్‌ చేయించారు. అగంతుడికి కాల్‌ చేస్తే స్విచ్ఛాఫ్‌ వస్తుందని, ట్రూ కాలర్‌లో హెచ్‌ఎంఎ్‌సడబ్ల్యూడబ్ల్యూ అని మాత్రమే వస్తుందని, చివరలో బీ లేదని పోలీసులు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు..

రూపాయి మారకానికి లక్ష్యమేమీ పెట్టుకోలేదు

Read Latest Telangana News and National News

Updated Date - Nov 21 , 2025 | 06:48 AM