Share News

Hyderabad: ఆన్‌లైన్‌లో నంబర్‌ కోసం వెతికి.. నేరగాళ్లకు చిక్కి..

ABN , Publish Date - May 02 , 2025 | 07:40 AM

సైబర్ నేరగాళ్లు కొత్త పద్దతులు వెతుక్కుంటున్నారు. పెరిగిన టెక్నాలజీనా వాడుకుంటూ పలువురిని బురిడీ కొట్టించి మోసాలకు పాల్పడుతున్నారు. హైదరాబాద్ నగరంలో ఈ సైబర్ నేరాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ప్రతిరోజూ ఈ తరహ మోసాలు జరగడం, పలువురు లక్షల్లో నష్టపోవడం వంటివి జరుగుతున్నాయి.

Hyderabad: ఆన్‌లైన్‌లో నంబర్‌ కోసం వెతికి.. నేరగాళ్లకు చిక్కి..

- రూ.1.18 లక్షలు పోగొట్టుకున్న వృద్ధుడు

హైదరాబాద్‌ సిటీ: కొరియర్‌ సంస్థ కస్టమర్‌ కేర్‌ నంబర్‌ కోసం ఆన్‌లైన్‌లో వెతికిన ఓ వృద్ధుడు సైబర్‌ నేరగాళ్ల చేతికి చిక్కాడు. వారి మాటలను నమ్మి రూ.1.18లక్షలు పోగొట్టుకున్నాడు. సిటీ సైబర్‌ క్రైమ్‌ డీసీపీ తెలిపిన వివరాల ప్రకారం నగరానికి చెందిన రిటైర్డ్‌ ఉద్యోగి(70)కి కొరియర్‌లో ఒక పార్శిల్‌ రావాల్సి ఉంది. ఇటీవల తన చిరునామా మారింది. దీనివల్ల పార్శిల్‌ మిస్సవుతుందేమో అనే ఉద్దేశ్యంతో అడ్రస్‌ మార్పు గురించి కొరియర్‌ సర్వీస్‌ ప్రతినిధులకు చెప్పడానికి ప్రయత్నించాడు.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: ఆ అపార్టుమెంట్‌.. ఓ బెట్టింగ్‌ డెన్‌


కస్టమర్‌ సర్వీస్‌ నంబర్‌ కోసం ఆన్‌లైన్‌లో వెదికాడు. ఓ నంబర్‌కు ఫోన్‌ చేసి అవతలి వ్యక్తికి విషయం చెప్పాడు. కొద్దిసేపటికి రిటర్న్‌ కాల్‌ వచ్చింది. తాము కస్టమర్‌ కేర్‌ ప్రతినిధిగా పరిచయం చేసుకున్నాడు. అడ్రస్‌ మార్పు ప్రాసెస్‌ చేయాలంటే నిబంధనల ప్రకారం కొద్దిగా రుసుం చెల్లించాల్సి ఉంటుందని, తాము పంపిన లింకు ఓపెన్‌ చేసి రూ.1 చెల్లించాలని చెప్పాడు.


city2.jpg

దీంతో బాధితుడు క్రిమినల్స్‌ పంపిన ఏపీకె ఫైల్స్‌ లింకులను ఓపెన్‌ చేసి రూ.1 సెండ్‌ చేశాడు. వెంటనే బాధితుడి ఫోన్‌ రెండుసార్లు స్విచాఫ్‌ అయి ఆన్‌ అయింది. ఆ తర్వాత బ్యాంకు ఖాతా చెక్‌ చేసుకోగా, రూ. 1.18లక్షలు డెబిట్‌ అయినట్లు గుర్తించాడు. ఇదంతా సైబర్‌ నేరగాళ్ల మోసమని ఆలస్యంగా తెలుసుకున్న బాధితుడు సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.


ఈ వార్తలు కూడా చదవండి

Gold Rates Today: బంగారం, వెండి ధరలు మళ్లీ తగ్గాయోచ్..ఎంతకు చేరాయంటే..

Financial Aid: పుస్తకాల ముద్రణకు తెలుగు వర్సిటీ ఆర్థిక సహాయం

డ్రగ్స్‌ రహిత రాష్ట్రంగా మార్చడమే లక్ష్యం

Gold Smuggling: శంషాబాద్‌ విమానాశ్రయంలో 3.5 కిలోల బంగారం పట్టివేత

Read Latest Telangana News and National News

Updated Date - May 06 , 2025 | 07:11 AM