Hyderabad: బ్రీఫ్ కేసుల్లో గంజాయి.. ఒడిశా టు హైదరాబాద్ బస్సులో తరలిస్తూ..
ABN , Publish Date - Sep 10 , 2025 | 07:50 AM
ఒడిశా టు హైదరాబాద్ బస్సులో బ్రీఫ్ కేసుల్లో గంజాయి తరలిస్తుండగా రంగారెడ్డి ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందం ఇద్దరిని అదుపులోకి తీసుకుంది. ఏఈఎస్ జీవన్‌కిరణ్, ఇన్‌స్పెక్టర్లు బాలరాజు, చంద్రశేఖర్ ఆధ్వర్యంలో అబ్దుల్లాపూర్‌మెట్ వద్ద విజయవాడ జాతీయ రహదారిపై మంగళవారం ఉదయం రూట్‌వాచ్ నిర్వహించారు.
- ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారుల అదుపులో ఇద్దరు
హైదరాబాద్: ఒడిశా టు హైదరాబాద్(Odisha to Hyderabad) బస్సులో బ్రీఫ్ కేసుల్లో గంజాయి తరలిస్తుండగా రంగారెడ్డి ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందం ఇద్దరిని అదుపులోకి తీసుకుంది. ఏఈఎస్ జీవన్‌కిరణ్, ఇన్‌స్పెక్టర్లు బాలరాజు, చంద్రశేఖర్ ఆధ్వర్యంలో అబ్దుల్లాపూర్‌మెట్ వద్ద విజయవాడ(Vijayawada) జాతీయ రహదారిపై మంగళవారం ఉదయం రూట్‌వాచ్ నిర్వహించారు. ఇదే సమయంలో ఒడిశా నుంచి హైదరాబాద్‌కు వస్తున్న బస్సును ఆపి తనిఖీ చేశారు. అనుమానంగా కనిపించిన రెండు బ్రీఫ్ కేసులను ఓపెన్ చేయగా గంజాయి కనిపించింది.

వాటికి సంబంధించిన బిరేన్ నాయక్, రాజేందర్‌చెట్టిలను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఒడిశా(Odisha)లోని జైపూర్‌కు చెందిన కుష్బు(Khushbu) అనే వ్యక్తి ఈ ఇద్దరి ద్వారా హైదరాబాద్‌కు గంజాయిని తరలిస్తున్నట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు గుర్తించారు. హైదరాబాద్‌లో ఎవరికి సరఫరా చేస్తున్నారనే విషయం కుష్బుకు మాత్రమే తెలుసని, ప్రస్తుతం అతడు పరారీలో ఉన్నాడని తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
భారీగా పెరిగిన బంగారం ధర.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
సీఎం రేవంత్ ఇంటి ప్రహరీ కూల్చివేత
Read Latest Telangana News and National News