Hyderabad: పాపం.. ఆ తల్లి, పిల్లలు ఎక్కడున్నారో ఏమో..
ABN , Publish Date - Oct 07 , 2025 | 10:44 AM
నలుగురు పిల్లలతో తల్లి అదృశ్యమైంది. ఈ ఘటన భవానీనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తలాబ్ కట్ట సిద్దిక్‌నగర్ రోడ్డు నెంబర్-5కు చెందిన ఫెరోజ్ ఖాన్, సాయిదున్నిసా భార్యాభర్తలు.
- నలుగురు పిల్లలతో తల్లి అదృశ్యం
హైదరాబాద్: నలుగురు పిల్లలతో తల్లి అదృశ్యమైంది. ఈ ఘటన భవానీనగర్ పోలీస్స్టేషన్(Bhavaninagar Police Station) పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తలాబ్ కట్ట సిద్దిక్‌నగర్ రోడ్డు నెంబర్-5కు చెందిన ఫెరోజ్ ఖాన్, సాయిదున్నిసా భార్యాభర్తలు. వీరికి ఫురఖాన్ ఖాన్(12), ఫర్హాన్ ఖాన్(10), ఫారియావున్నిసా(8), ఫైజున్నిసా(6) సంతానం. భర్త తరచూ మద్యం తాగొచ్చి భార్యతో గొడవ పడేవాడు. ఇలాగే సెప్టెంబర్ 30న ఫిరోజ్ ఖాన్(Feroz Khan) మద్యం తాగొచ్చి భార్య సాయిదున్నిసాతో గొడవ పడ్డాడు.

దీంతో మనస్థాపం చెందిన సాయిదున్నిసా అక్టోబర్ 1న ఉదయం 4గంటల సమయంలో భర్త నిద్రపోతుండగా నలుగురు పిల్లలతో ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. భర్త లేచి చూసే సరికి ఇంటో ఎవరూ కనిపించలేదు. భార్య పుట్టిళ్లు, బంధువుల వద్ద వేదికినా ఆచూకీ లభించకపోవడంతో ఫెరోజ్ ఖాన్ భవానీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పసిడి పరుగులు.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
ఆల్మట్టి ఎత్తు తగ్గింపుపై హామీతో రావాలి
బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ రాజకీయం
Read Latest Telangana News and National News