Share News

Hyderabad: అరెస్ట్ పేరుతో భయపెట్టి.. రూ.1.23 కోట్లు కొట్టేసి..

ABN , Publish Date - May 09 , 2025 | 10:32 AM

టెక్నాలజీని వాడుకుని అడ్డదారుల్లో డబ్బు కొల్లగొడుతున్న ఓ సైబర్ నేరగాడు ఎట్టకేలకు పట్టుబడ్డాడు. ఓ వైద్యుడి నుంచి రూ.1.23 కోట్లు కొట్టేసిన అతగాడిని పోలీసులు అరెస్టు చేశారు. పెరిగిన టెక్నాలజీతో ప్రతిరోజూ ఈ తరహ మోసాలకు పాల్పడుతూ కోట్లాది రూపాయలను కొల్లగొడుతున్నారు. అయితే.. ఏదీ ఎంతకాలం ఆగదుగా.. పాపం పండి చివరకు జైలు జీవితాన్ని గడుపుతున్నారు.

Hyderabad: అరెస్ట్ పేరుతో భయపెట్టి.. రూ.1.23 కోట్లు కొట్టేసి..

- వైద్యుడిని మోసం చేసిన కేసులో ఒకరి అరెస్ట్‌

హైదరాబాద్‌ సిటీ: డిజిటల్‌ అరెస్టు పేరుతో భయపెట్టి నగరానికి చెందిన డాక్టర్‌ నుంచి రూ.1.23 కోట్లు కొట్టేసిన కేసులో సైబర్‌ క్రిమినల్‌ను పోలీసులు అరెస్టు చేశారు. డీసీపీ ధార కవిత తెలిపిన వివరాల ప్రకారం నగరానికి చెందిన 45 ఏళ్ల వైద్యుడికి గతేడాది అక్టోబర్‌లో గుర్తుతెలియని వ్యక్తి వాట్సాప్‌ కాల్‌(WhatsApp call) చేశాడు. ఇండియన్‌ పోస్టాఫీస్‌ ముంబై నుంచి మాట్లాడుతున్నట్లు నమ్మించాడు. మీ పేరుతో విదేశాలకు వెళ్తున్న పార్శిల్‌లో 14 పోలీస్‌ యూనీఫామ్స్‌, 14 ఐడీకార్డులు, బ్యాంకు డెబిట్‌ కార్డులు, మత్తు ఇంజక్షన్లు ఉన్నాయని, క్రైమ్‌ బ్రాంచి పోలీసులు సీజ్‌ చేశారని తెలిపారు.

ఈ వార్తను కూడా చదవండి: Special Trains: 12 నుంచి చర్లపల్లి-శ్రీకాకుళం మధ్య 26 ప్రత్యేక రైళ్లు


ఒకసారి వారితో మాట్లాడండి అంటూ కాల్‌ను బదిలీ చేశాడు. అవతలివైపు పోలీస్‌ డ్రెస్‌లో ఉన్న వ్యక్తులు విడతల వారీగా వీడియోకాల్‌లో మాట్లాడి మీపై డ్రగ్స్‌ అక్రమ రవాణా, మనీల్యాండరింగ్‌ కేసులు నమోదయ్యాయని, అరెస్టు చేసి జైలుకు పంపాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఇలా జరగకుండా ఉండాలంటే మీ ఖాతాలు ఆడిట్‌ చేయాల్సి ఉంటుందని, ముందుగా వాటిలో ఉన్న డబ్బు ఆర్‌బీఐ ఖాతాకు బదిలీ చేయాలన్నారు. ఆ కేసుతో మీకు సంబంధం లేదని తేలాక డబ్బు మళ్లీ రిటర్న్‌ చేస్తారని నమ్మించారు. భయబ్రాంతులకు గురైన డాక్టర్‌ విడతల వారీగా వారు సూచించిన బ్యాంకు ఖాతాలకు రూ.1,23,90,510 బదిలీ చేశారు.


ఎన్ని రోజులైనా డబ్బు తిరిగి రాకపోవడం, ఎవరూ స్పందించకపోవడంతో సైబర్‌ మోసమని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. టెక్నికల్‌ ఎవిడెన్స్‌ ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు బ్యాంకు ఖాతాల ఆధారంగా ఒక నిందితుడు మహారాష్ట్రకు చెందిన రామ్‌ప్రసాద్‌ సాహెబ్రౌ సాలుంకేను పట్టుకున్నారు. ప్రైవేట్‌ ఉద్యోగం చేస్తున్న రామ్‌ప్రసాద్‌ సైబర్‌ ముఠాలకు బ్యాంకు ఖాతాలు సమకూర్చుతున్నట్లు విచారణలో గుర్తించారు. మిగతా వారి కోసం గాలిస్తున్నట్లు డీసీపీ తెలిపారు. బ్యాంకు ఖాతాలు సమకూర్చుతున్న నిందితునిపై దేశవ్యాప్తంగా 22 కేసులు, తెలంగాణలో 4 కేసులు నమోదై ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. డబ్బును రికవరీ చేయాల్సి ఉంది.


ఈ వార్తలు కూడా చదవండి

Breaking News: భారత్-పాక్ యుద్ధంపై చైనా తాజా రియాక్షన్ ఇదే..

ToDay Gold Rates: పసిడి ప్రియులకు షాక్.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు..

నవ్వించడమే సింగిల్‌ లక్ష్యం

మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ మసూద్ అజర్ చనిపోయాడా ..?

Operation Sindoor: యుద్ధ బీభత్సం

Read Latest Telangana News and National News

Updated Date - May 09 , 2025 | 10:32 AM