Hyderabad: యువతి పేరుతో సైబర్ వల.. రూ.11 లక్షలు గోవిందా...
ABN , Publish Date - Aug 30 , 2025 | 06:34 AM
వివాహ సంబంధిత వెబ్‌సైట్‌లో పరిచయమైన యువతి మాటలు నమ్మిన యువకుడు సైబర్ నేరగాళ్లకు చిక్కి రూ.11 లక్షలు పోగొట్టుకున్నాడు. పంజాగుట్టకు చెందిన యువకుడి (31)కి రెడ్డి మ్యాట్రిమోని సైట్‌లో ఓ యువతి పరిచయమైంది.
హైదరాబాద్ సిటీ: వివాహ సంబంధిత వెబ్‌సైట్‌లో పరిచయమైన యువతి మాటలు నమ్మిన యువకుడు సైబర్ నేరగాళ్లకు చిక్కి రూ.11 లక్షలు పోగొట్టుకున్నాడు. పంజాగుట్ట(Panjagutta)కు చెందిన యువకుడి (31)కి రెడ్డి మ్యాట్రిమోని సైట్‌లో ఓ యువతి పరిచయమైంది. తాను స్కాట్‌లాండ్‌లో ఉంటున్నానని చెప్పి వాట్స్‌పలో చాట్ చేస్తూ పరిచయం పెంచుకుంది. క్రిప్టో ట్రేడింగ్ ద్వారా ఎక్కువ ఆదాయం సంపాదించవచ్చని చెప్పింది. పెట్టుబడి పెట్టేలా అతడిని ప్రోత్సహించి, కస్టమర్ కేర్‌కు నంబర్ ఇచ్చానని తనను సంప్రదిస్తారని చెప్పింది.

బిట్‌కాయిన్ డాట్ సీఆర్‌కామ్ ప్రతినిధులమంటూ వాట్సప్(WhatsApp) లో సంప్రదించిన సైబర్ నేరగాళ్లు యాప్‌ను డౌన్‌లోడ్ చేయించారు, పెట్టుబడి పేరుతో పలు దఫాలుగా రూ.11.04 లక్షలు ఖాతాల్లో వేయించుకున్నారు. యాప్‌లో లాభాలు చూపుతున్నా విత్‌డ్రా ఆప్షన్ లేకపోవడం, ఇంకా డబ్బు డిమాండ్ చేయడంతో బాధితుడు సైబర్ క్రైం ఠాణాలో ఫిర్యాదు చేశాడు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఇన్‌ఫార్మర్ నెపంతో గిరిజనుడి హత్య
గణేశుడి మండపం వద్ద కరెంట్ షాక్‌తో బాలుడి మృతి
Read Latest Telangana News and National News