Share News

Hyderabad: ఇదో రకం మోసం.. ఆర్‌టీఓ చలాన్‌ పేరుతో లింకు పంపి..

ABN , Publish Date - Sep 25 , 2025 | 07:20 AM

ఆర్‌టీఓ చలాన్‌, పీఎం కిసాన్‌ యోజన పేరుతో ఏపీకే లింకులు పంపిన సైబర్‌ నేరగాళ్లు నాలుగు రోజుల వ్యవధిలో నగరానికి చెందిన ముగ్గురు నుంచి రూ.4.85 లక్షలు కాజేశారు. ముషీరాబాద్‌కు చెందిన వ్యక్తి (47) సంప్రదించిన నేరగాళ్లు ‘మీ వాహనంపై పెండింగ్‌ చలాన్లు ఉన్నాయి.

Hyderabad: ఇదో రకం మోసం.. ఆర్‌టీఓ చలాన్‌ పేరుతో లింకు పంపి..

- రూ.4.85లక్షలు స్వాహా

- నాలుగు రోజుల్లో మూడు ఘటనలు

హైదరాబాద్‌ సిటీ: ఆర్‌టీఓ చలాన్‌, పీఎం కిసాన్‌ యోజన పేరుతో ఏపీకే లింకులు పంపిన సైబర్‌ నేరగాళ్లు నాలుగు రోజుల వ్యవధిలో నగరానికి చెందిన ముగ్గురు నుంచి రూ.4.85 లక్షలు కాజేశారు. ముషీరాబాద్‌(Musheerabad)కు చెందిన వ్యక్తి (47) సంప్రదించిన నేరగాళ్లు ‘మీ వాహనంపై పెండింగ్‌ చలాన్లు ఉన్నాయి. వెంటనే లింక్‌ ద్వారా చెల్లించాలి’ అని ఏపీకే లింక్‌ను పంపాడు. నిజమని నమ్మిన బాధితుడు లింక్‌ను తెరిచి వివరాలు నమోదు చేశాడు. గంటల వ్యవధిలో అతడి ఖాతా నుంచి రూ.1.82 లక్షలు కాజేశారు.


city2.2.jpg

చుడీబజార్‌(Chudi Bazaar)కు చెందిన వ్యక్తి (54)ని సంప్రదించిన నేరగాళ్లు పెండింగ్‌ చలాన్ల పేరుతో ఏపీకే లింక్‌ పంపి రూ.లక్ష వేరే ఖాతాలకు బదిలీ చేసుకున్నారు. మరో ఘటనలో భోలక్‌పూర్‌(Bholakpur)కు చెందిన వ్యక్తి (34) నుంచి కూడా ఇదే తరహాలో రూ.2.03 లక్షలు వేర్వేరు ఖాతాలకు బదిలీ చేసుకున్నారు. ఏపీకే లింకులు పంపి, మాల్‌వేర్‌ సహాయంతో ఫోన్‌ను హ్యాక్‌ చేసి ఖాతాలు కొల్లగొడుతున్నారని, అపరిచితుల మాటలు నమ్మవద్దని సైబర్‌ క్రైం డీసీపీ కవిత సూచించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఎఫ్‌ఎంసీజీకి జీఎస్‌టీ తంటా

మతమేదైనా జాతీయతే ప్రధానం

Read Latest Telangana News and National News

Updated Date - Sep 25 , 2025 | 07:20 AM