Share News

FMCG GST Impact: ఎఫ్‌ఎంసీజీకి జీఎస్‌టీ తంటా

ABN , Publish Date - Sep 25 , 2025 | 05:28 AM

జీఎ్‌సటీ రేట్ల తగ్గింపు అమలు చేయడం ఎఫ్‌ఎంసీజీ కంపెనీలకు పెద్ద తలనొప్పిగా మారింది. చిన్న చిన్న ప్యాకెట్ల రూపంలో రూ.10, రూ.5, రూ.2 ఎంఆర్‌పీకి అమ్మే వస్తువుల ధర ల్ని, జీఎ్‌సటీ 2.0 సంస్కరణలతో...

FMCG GST Impact: ఎఫ్‌ఎంసీజీకి జీఎస్‌టీ తంటా

తగ్గింపు అమలులో చిక్కులు.. పరిమాణం పెంచి పాత ధరలు!

న్యూఢిల్లీ: జీఎ్‌సటీ రేట్ల తగ్గింపు అమలు చేయడం ఎఫ్‌ఎంసీజీ కంపెనీలకు పెద్ద తలనొప్పిగా మారింది. చిన్న చిన్న ప్యాకెట్ల రూపంలో రూ.10, రూ.5, రూ.2 ఎంఆర్‌పీకి అమ్మే వస్తువుల ధర ల్ని, జీఎ్‌సటీ 2.0 సంస్కరణలతో పావ లా నుంచి 55 పైసల వరకు తగ్గించి అమ్మాల్సి వస్తోంది. అయితే తగ్గిన ధరలకు సరిపడా చిల్లర లేక అటు కొనుగోలుదారులు, ఇటు వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పేద, మధ్య తరగతి వర్గాలు, గ్రామీణ ప్రజల నుంచి ఈ సమస్య ఎక్కువగా ఉందని రిటైల్‌ వ్యాపారులు చెబుతున్నారు.

డిసెంబరు వరకు ఇంతే

సాధారణంగా ఎఫ్‌ఎంసీజీ కంపెనీలు రెండు నెలల వినియోగానికి సరిపడా వస్తువులను మార్కెట్‌లో విడుదల చేస్తుంటాయి. జీఎ్‌సటీ రేట్ల తగ్గింపుపై ఈ నెల మొదటి వారంలో గానీ కంపెనీలకు స్పష్టత రాలేదు. నవంబరు వరకు మార్కెట్‌లో విడుదల చేసే వస్తువుల ఎంఆర్‌పీ ధరలను కంపెనీలు ఇప్పటికే ముద్రించేశాయి. ఇపుడు జీఎ్‌సటీ తగ్గింపునకు అనుగుణంగా రేట్లు తగ్గించినా, చిల్లర సమస్య ఎదురవుతోంది. ఈ కారణంగా ఆయా ప్యాకెట్లలోని వస్తువుల పరిమాణం పెంచి, డిసెంబరు నుంచి పాత ఎంఆర్‌పీ ధరలకే మార్కెట్‌లో విడుదల చేయాలని కంపెనీలు యోచిస్తున్నాయి.

‘ఇది తాత్కాలిక సమస్య. ప్యాకెట్‌లోని వస్తువుల పరిమాణం పెంచడం ద్వారా నెలన్నర నుంచి రెండు నెలల్లో ఈ సమస్యను అధిగమిస్తాం’ అని పార్లే ప్రొడక్ట్స్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ మయాంక్‌ షా చెప్పారు. నువామా ఇనిస్టిట్యూషనల్‌ ఈక్విటీస్‌ సీనియర్‌ అధికారి అభనీశ్‌ రాయ్‌ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఈ వార్తలు కూడా చదవండి..

కృష్ణమ్మకు వరద పోటు.. ప్రభుత్వం అలర్ట్

అసెంబ్లీలో ఆమోదం పొందనున్న పలు బిల్లులు

For More AP News And Telugu News

Updated Date - Sep 25 , 2025 | 05:28 AM