Share News

Hyderabad: ఆ 10 గంటలు ఏం జరిగింది...

ABN , Publish Date - Sep 02 , 2025 | 06:54 AM

కత్తితో గొంతు కోసుకొన్న దంపతుల ఘటనలో కేపీహెచ్‌బీ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. మూడు రోజుల క్రితం వెలుగులోకి వచ్చిన ఈ ఘటన నగరంలో సంచలనం సృష్టించింది. అయితే ఆత్మహత్య చేసుకోవాలనుకున్న భార్యాభర్తలు రామకృష్ణారెడ్డి, రమ్యకృష్ణ గొంతుకోసుకున్న మాట వాస్తవమేనని, ఈ ఘటనలో భర్త మాత్రమే మృతిచెందగా, భార్య స్వల్ప గాయాలతో బయటపడిందని పోలీసులు తెలిపారు.

Hyderabad: ఆ 10 గంటలు ఏం జరిగింది...

- కళ్లముందే భర్త ప్రాణాలు పోతున్నా.. భార్య ఎందుకు కాపాడే ప్రయత్నం చేయలేదు

- యూ టర్న్‌ తీసుకోవడంలో ఆమె ఆంతర్యం ఏమిటి..?

- గొంతుకోసుకున్న దంపతుల ఘటనలో దర్యాప్తు ముమ్మరం

హైదరాబాద్‌ సిటీ: కత్తితో గొంతు కోసుకొన్న దంపతుల ఘటనలో కేపీహెచ్‌బీ పోలీసులు(KPHB Police) దర్యాప్తు ముమ్మరం చేశారు. మూడు రోజుల క్రితం వెలుగులోకి వచ్చిన ఈ ఘటన నగరంలో సంచలనం సృష్టించింది. అయితే ఆత్మహత్య చేసుకోవాలనుకున్న భార్యాభర్తలు రామకృష్ణారెడ్డి, రమ్యకృష్ణ(Ramakrishna Reddy, Ramya Krishna) గొంతుకోసుకున్న మాట వాస్తవమేనని, ఈ ఘటనలో భర్త మాత్రమే మృతిచెందగా, భార్య స్వల్ప గాయాలతో బయటపడిందని పోలీసులు తెలిపారు. ఆ సమయంలో ఒకరినొకరు గొంతుకోసుకున్నట్లు తేలడం, భార్య మాత్రమే ప్రాణాలు దక్కించుకోవడంతో పోలీసులు ఆమెపై హత్య కేసు నమోదు చేశారు.


భర్త శవం పక్కనే పదిగంటలు..

కళ్లముందే భర్త రామకృష్ణారెడ్డి ప్రాణాలు పోతున్నా భార్య రమ్యకృష్ణ చలించలేదు. ఇద్దరూ కలిసి ఆత్మహత్య చేసుకోవాలని బలంగా నిర్ణయించుకున్నప్పటికీ ఆమె మాత్రం వెనుకడుగు వేసింది. ఆమె సడన్‌గా తన నిర్ణయం మార్చుకోవడంపై పోలీసులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. భర్త చనిపోయిన తర్వాత తాను గొంతు కోసుకోవడానికి ధైర్యం సరిపోలేదని చెప్పినట్లు తెలిసింది.


city2.2.jpg

అదే నిజమైతే తన భర్తను బతికించుకునే ప్రయత్నం ఎందుకు చేయలేదు..? అటు పోలీసులకు గానీ, అంబులెన్స్‌ గానీ ఎందుకు సమాచారం ఇవ్వలేదు. రాత్రి 9 గంటలకు భర్త చనిపోతే.. మరుసటిరోజు ఉదయం 7 గంటల వరకు ఆమె నోరెందుకు విప్పలేదు.. ఆ పది గంటలు ఏం జరిగింది..? ఎందుకు ఆమె యూ టర్న్‌ తీసుకుందనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఈ కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సాంకేతిక ఆధారాల కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఆరోగ్యానికి తీపి కబురు

పడిగాపులు.. తోపులాటలు

Read Latest Telangana News and National News

Updated Date - Sep 02 , 2025 | 06:54 AM