Share News

Hyderabad: తల్లిదండ్రులు మాట్లాడటంలేదని..

ABN , Publish Date - Sep 16 , 2025 | 07:56 AM

తల్లిదండ్రులు మందలించి, మాట్లాడడం మానేశారని మనస్తాపానికి గురైన ఇంటర్‌ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్‌ మండలం వెంకిర్యాల గ్రామంలో ఈ సంఘటన జరిగింది. సీఐ ప్రభాకర్‌రెడ్డి, గ్రామస్థులు, సమీప బంధువులు తెలిపిన వివరాల ప్రకారం... వెంకిర్యాల గ్రామానికి చెందిన మార్త రమేష్‌ ఆర్టీసీ డ్రైవర్‌.

Hyderabad: తల్లిదండ్రులు మాట్లాడటంలేదని..

- కుమార్తె ఆత్మహత్య

- యాదాద్రి భువనగిరి జిల్లా వెంకిర్యాలలో ఘటన

యాదాద్రి భువనగిరి: తల్లిదండ్రులు మందలించి, మాట్లాడడం మానేశారని మనస్తాపానికి గురైన ఇంటర్‌ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఆదివారం యాదాద్రి భువనగిరి(Yadadri Bhuvanagiri) జిల్లా బీబీనగర్‌ మండలం వెంకిర్యాల గ్రామంలో ఈ సంఘటన జరిగింది. సీఐ ప్రభాకర్‌రెడ్డి, గ్రామస్థులు, సమీప బంధువులు తెలిపిన వివరాల ప్రకారం... వెంకిర్యాల గ్రామానికి చెందిన మార్త రమేష్‌ ఆర్టీసీ డ్రైవర్‌.


అతడికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. పెద్ద కుమార్తె మార్త శ్రీవెన్నెల(17) తార్నాకలోని రైల్వే జూనియర్‌ కళాశాల(Railway Junior College)లో ఇంటర్‌ సెకండియర్‌ చదువుతోంది. నాలుగు రోజుల కిందట ఇంటికి ఆలస్యంగా రావడం, ఫోన్‌ చేసినా ఎత్తకపోవడంతో తండ్రి రమేష్‌ కుమార్తెను తీవ్రస్థాయిలో మందలించారు. అంతేకాకుండా ఇంట్లో ఎవరూ శ్రీవెన్నెలతో సరిగా మాట్లాడడం మానేశారు.


city4.2.jpg

ఈ నేపథ్యంలో ఆదివారం బంధువుల ఇంట్లో శుభకార్యం ఉండడంతో తల్లిదండ్రులు శ్రీవెన్నెలను ఇంట్లోనే ఉంచి మరో కుమార్తె, కుమారుడితో కలిసి ఊరికి వెళ్లారు. సాయంత్రం తల్లిదండ్రులు ఇంటికి తిరిగి వచ్చి చూడగా శ్రీవెన్నెల ఇంట్లో ఉరి వేసుకుని ఉండటాన్ని గుర్తించారు. ఈ సంఘటనపై తండ్రి రమేష్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నట్లు సీఐ ప్రభాకర్‌ రెడ్డి తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మళ్లీ తగ్గిన బంగారం ధరలు..కానీ వెండి మాత్రం

మొదటి పావుగంటలో రిజర్వేషన్లకు ఆధార్‌

ప్రైవేటు కాలేజీల ఆందోళనలకు సంపూర్ణ మద్దతు

Read Latest Telangana News and National News

Updated Date - Sep 16 , 2025 | 07:57 AM