Share News

Jharkhand Crime News: దారుణం:14 ఏళ్ల బాలికపై గ్యాంగ్ రేప్.. చివరకు!

ABN , Publish Date - Oct 13 , 2025 | 07:28 PM

జార్ఘండ్ రాజధాని రాంచీలోని రతు ప్రాంతంలో 14 ఏళ్ల బాలిక తన కుటుంబంతో నివాసం ఉంటుంది. అయితే ఆదివారం ఆ బాలికపై కామాంధులు కాటేశారు. రాత్రి సమయంలో 9 మంది వ్యక్తులు ఆ బాలికపై అత్యాచారం చేసినట్లు పోలీసులు తెలిపారు.

Jharkhand Crime News: దారుణం:14 ఏళ్ల బాలికపై గ్యాంగ్ రేప్.. చివరకు!

నేటి కాలంలో కామాంధుల సంఖ్య పెరిగిపోతుంది. అమ్మాయిలు బయటకు వెళ్లాలంటేనే భయపడుతున్నారు. నిత్యం ఏదో ఒక ప్రాంతంలో ఆడవారిపై అఘాయిత్యాలు జరుగుతున్నాయి. ఇలాంటి ఘటనలను అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు చేసినా.. కామాంధుల్లో మార్పు రావడం లేదు. ఇటీవల పశ్చిమ బెంగాల్ లో ఓ వైద్య విద్యార్థినిపై గ్యాంగ్ రేప్ జరిగింది. ఈ ఘటన మరువక ముందే తాజాగా జార్ఖండ్ లో అదే తరహా ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...


జార్ఘండ్(Jharkhand) రాజధాని రాంచీలోని రతు ప్రాంతంలో 14 ఏళ్ల బాలిక తన కుటుంబంతో నివాసం ఉంటుంది. అయితే ఆదివారం ఆ బాలికపై కామాంధులు కాటేశారు. రాత్రి సమయంలో 9 మంది వ్యక్తులు ఆ బాలికపై అత్యాచారం చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈఘటన(Ranchi Case)పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేశారు. సోమవారం పలు ప్రాంతాల్లో పోలీసులు దాడులు నిర్వహించి ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు. బాలికకు వైద్య పరీక్షలు కూడా నిర్వహించామని పోలీస్ సూపరింటెండెంట్ ప్రవీణ్ పుష్కర్ తెలిపారు. మిగిలిన నలుగురు నిందితులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని ఎస్పీ తెలిపారు. అలానే నిందితులపై పోక్సో చట్టం(POCSO Case)లోని వివిధ సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశామని రతు పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జి అధికారి రాం నారాయణ్ సింగ్ తెలిపారు.


ఇవి కూడా చదవండి:

నోబెల్‌ శాంతి బహుమతి సమాచారం లీక్‌

58 మంది పాక్‌ సైనికులను చంపాం: అప్ఘాన్ మంత్రి

Updated Date - Oct 13 , 2025 | 07:28 PM