Share News

Saidabad Juvenile Home Incident: సైదాబాద్ జువెనైల్ హోంలో దారుణం.. ఆరుగురు బాలురపై లైంగిక దాడి!

ABN , Publish Date - Oct 13 , 2025 | 07:49 AM

దసరా పండగ సందర్భంగా ఇంటికి వచ్చి తిరిగి జువెనైల్ హోంకు వెళ్లడానికి ఓ బాలుడు నిరాకరించాడు. తల్లితో కలిసి బోరున విలపించాడు. అయితే, ఎందుకని ఆరా తీయగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

Saidabad Juvenile Home Incident: సైదాబాద్ జువెనైల్ హోంలో దారుణం.. ఆరుగురు బాలురపై లైంగిక దాడి!
Saidabad Juvenile Home Incident

ఇంటర్నెట్ డెస్క్: సైదాబాద్ జువెనైల్ హోంలో దారుణం చోటుచేసుకుంది. ఆరుగురు బాలురపై పర్యవేక్షకుడు లైంగిక దాడి ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లో వెళ్లితే..


దసరా పండుగకి జువెనైల్ హోంలో ఉన్న ఓ బాలుడు ఇంటికి వచ్చాడు. అయితే, పండుగ తర్వాత ఆ బాలుడు తిరిగి జువెనైల్ హోంకు వెళ్లనని తల్లి వద్ద బోరున విలపించాడు. అయితే, ఎందుకని ఆరా తీయగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.


అభంశుభం తెలియని బాలురపై జువెనైల్ హోం సంరక్షుకుడు అసహజరీతిలో తరచూ లైంగికదాడికి పాల్పడినట్లు తెలిసింది. బాలుడు ఇచ్చిన సమాచారంతో బాధిత తల్లి సైదాబాద్ పోలీసులకు పిర్యాదు చేసింది. అయితే, మొదట బాధితుడు ఒక్కడే అనుకున్నారు పోలీసులు. కానీ, కూపీ లాగగా మరో అయిదుగురిపైనా లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ అయింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు ఘటనపై పూర్తిగా దర్యాప్తు చేపట్టారు.


ఇవి కూడా చదవండి:

నోబెల్‌ శాంతి బహుమతి సమాచారం లీక్‌

58 మంది పాక్‌ సైనికులను చంపాం: అప్ఘాన్ మంత్రి

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Oct 13 , 2025 | 07:49 AM