Share News

Hyderabad: ఆడపిల్ల పుట్టిందని ఎంతపని చేశాడో తెలిస్తే..

ABN , Publish Date - May 16 , 2025 | 08:46 AM

ఆడపిల్ల పుట్టిందని.. ముక్కుపచ్చలారని ఆ పసికందుపై దారుణానికి ఒడిగట్టాడో కసాయి తండ్రి. 14 రోజుల పసికందు గొంతుకోసి హతమార్చాడు. ఈ సంఘటన హైదరాబాద్ నగరంలోని గోల్కొండ పోలీస్‏స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

Hyderabad: ఆడపిల్ల పుట్టిందని ఎంతపని చేశాడో తెలిస్తే..

- పసికందు గొంతుకోసిన తండ్రి

- ఆడపిల్ల పుట్టిందని అఘాయిత్యం

- చెత్తకుప్పలో మృతదేహం స్వాధీనం

- పోలీసుల అదుపులో నిందితుడు

హైదరాబాద్: ఆడపిల్లగా పుట్టడమే ఆ పసికందుకు శాపంగా మారింది. తల్లి పొత్తిళ్లలో నిద్రపోతున్న 14 రోజుల పసికందును తండ్రి గొంతు కోసి హతమార్చిన సంఘటన గోల్కొండ పోలీస్‏స్టేషన్‌(Golconda Police Station) పరిధిలో జరిగింది. ఇన్‌స్పెక్టర్‌ సైదులు తెలిపిన వివరాల ప్రకారం.. నేపాల్‌కు చెందిన జగత్‌ విశ్వకర్మ, గౌరీ దంపతులు. జగత్‌ కుటుంబంతో గతంలో లక్డీకాపూల్‌ ప్రాంతంలో ఉంటూ వాచ్‌మన్‌గా పనిచేసేవాడు.

ఈ వార్తను కూడా చదవండి: Trains: హైదరాబాద్‌ - కలబురిగి మధ్య 4 ప్రత్యేక రైళ్లు


ఏడాది క్రితం టోలీచౌకి గుల్షన్‌ కాలనీలో ఓ అపార్ట్‌మెంట్‌లో వాచ్‌మన్‌గా చేరాడు. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. అనారోగ్యంతో కుమారుడు చనిపోయాడు. తర్వాత గర్భం దాల్చిన గౌరికి 14 రోజుల క్రితం పాప పుట్టింది. ఆడపిల్ల పుట్టిందన్న కోపంతో బుధవారం రాత్రి తల్లి పొత్తిళ్లలో నిద్రపోతున్న పసికందును అర్ధరాత్రి బయటకు తీసుకెళ్లి కత్తితో గొంతుకోసి హతమార్చాడు. మృతదేహాన్ని గోనె సంచిలో పెట్టి ఇంట్లోనే ఉంచాడు. గంట తర్వాత నిద్రలేచిన గౌరి పాప ఏదని భర్తను అడగగా.. చంపేశానని, మృతదేహం గోనె సంచిలో ఉందని చెప్పాడు.


city3.jpg

గౌరి సమీపంలో ఉన్న పరిచయస్తులకు విషయం చెప్పేందుకు బయటకు వెళ్లింది. ఆ సమయంలో జగత్‌ విశ్వకర్మ పసికందు మృతదేహాన్ని తీసుకెళ్లి 7 టూంబ్స్‌ రోడ్డులో చెత్తకుప్పలో పడేశాడు. గౌరి ఫిర్యాదు మేరకు పోలీసులు జగత్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడిచ్చిన సమాచారం మేరకు పసికందు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. జగత్‌ తరచూ మద్యం తాగుతుంటాడని, మానసిక పరిస్థితి సరిగా ఉండదని పోలీసులు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి

Gold And Silver Rate: బంగారం ధరలు ఢమాల్.. లక్ష నుంచి దిగజారుతూ..

తెలంగాణలో 22కోట్ల ఏళ్ల నాటి రాక్షసబల్లి అవశేషాలు

Congress: ఈటల.. దిగజారుడు రాజకీయం తగదు

పకృతి విధ్వంసానికి సీఎందే బాధ్యత: కేటీఆర్‌

ఆర్టీసీ సీసీఎస్‌లో 15 రోజుల్లోగా రూ.1,029 కోట్లు జమ చేయాలి

Read Latest Telangana News and National News

Updated Date - May 16 , 2025 | 08:49 AM