Hyderabad: ఎండీ ఫొటోను డీపీగా పెట్టి.. రూ.2.7కోట్ల మోసం
ABN , Publish Date - Oct 10 , 2025 | 08:54 AM
కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ) ఫొటోను వాట్సాప్‌లో డీపీగా పెట్టుకొని రూ.2.7కోట్ల మేర మోసం చేసిన ఇద్దరు వ్యక్తులను, మరో కేసులో సైబర్ నేరాలు చేసే వారికి బ్యాంకు ఖాతాలను అందజేసిన ఐదుగురిని సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు.
- వేర్వేరు సైబర్ క్రైం కేసుల్లో ఏడుగురి అరెస్టు
హైదరాబాద్ సిటీ: కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ) ఫొటోను వాట్సాప్‌లో డీపీగా పెట్టుకొని రూ.2.7కోట్ల మేర మోసం చేసిన ఇద్దరు వ్యక్తులను, మరో కేసులో సైబర్ నేరాలు చేసే వారికి బ్యాంకు ఖాతాలను అందజేసిన ఐదుగురిని సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు(Cyberabad Cyber Crime Police) అరెస్ట్ చేశారు. సైబర్ క్రైం డీసీపీ బి.సాయి శ్రీ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
నగరంలోని గ్రీన్ కో గ్రూపు కంపెనీ ఎండీ ఫొటోను వాట్సాప్ డీపీ(WhatsApp DP)గా పెట్టుకున్న ఇద్దరు సైబర్ నేరగాళ్లు ఆ కంపెనీ సీఎ్‌ఫఓకు రెండు వాట్సాప్ నంబర్ల ద్వారా అత్యవసర క్లయింట్ చెల్లింపులు అనే సందేశాలు పంపారు. అవి ఎండీ పంపించినవే అయి ఉంటాయని నమ్మిన సీఎఫ్ఓ, చీఫ్ ఫైనాన్స్ కంట్రోలర్‌లు కలిసి ఓఎన్‌ఐటీఎ్‌సయూకెఎ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు చెందిన బ్యాంకు ఖాతాకు మొదట రూ.1.95 కోట్లు, తర్వాత మరో రూ.75లక్షలు కలిపి వారు మొత్తం రూ.2.7 కోట్లు బదిలీ చేశారు.

ఆ తర్వాత అది సైబర్ నేరగాళ్ల పని అని తెలుసుకుని సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. జూన్ 16వ తేదీ బెంగళూరులో ఇద్దరిని అరెస్టు చేయగా, ఈనెలలో మరో ఇద్దరిని అరెస్టు చేశామని సైబర్ క్రైం డీసీపీ సాయి శ్రీ తెలిపారు.
మరో కేసులో సైబర్ నేరగాళ్లకు బ్యాంకు ఖాతాలు సమకూర్చిన వివిధ రాష్ట్రాలకు చెందిన ఐదుగురిని అదుపులోకి తీసుకున్నట్లు డీసీపీ తెలిపారు. వారి నుంచి 33 మొబైల్ ఫోన్లు, 2 డెల్ ల్యాప్‌టాప్ లు, 32 చెక్ బుక్కులు, 23 ఏటీఎం కార్డులు, 48సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
సీఎం కాన్వాయ్ అంబులెన్స్‌కు ఇన్సూరెన్స్ మరిచారు
భార్య డబ్బులు ఇవ్వలేదని చెరువులో దూకిన భర్త
Read Latest Telangana News and National News