Share News

Hyderabad: రూ.200తో ప్రారంభించి.. రూ.3.56 లక్షలు లూటీ

ABN , Publish Date - Apr 10 , 2025 | 09:59 AM

ఎక్కడ ఉంటారో తెలియదు.. ఎలా ఉంటారో తెలియదు.. కానీ లక్షలు రూపాయలు కొల్లగొడుతున్నారు. హైదరాబాద్ నగరంలో సైబర్ మోసాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. ప్రతిరోజూ ఎక్కడో ఓచోట ఈ తరహా మోసాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా రూ.3.56 లక్షలు కాజేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. వివరాలిలా ఉన్నాయి.

Hyderabad: రూ.200తో ప్రారంభించి.. రూ.3.56 లక్షలు లూటీ

- పార్ట్‌టైం జాబ్‌ పేరుతో సైబర్‌ మోసం

హైదరాబాద్‌ సిటీ: పార్ట్‌ టైం ఉద్యోగం పేరుతో నగరానికి చెందిన యువతికి సైబర్‌ నేరగాళ్లు టోకరా పెట్టారు. రిజిస్ట్రేషన్‌ చార్జీలంటూ రూ.200తో మొదలు పెట్టి రూ.3.56 లక్షలు కాజేశారు. నగరానికి చెందిన యువతి (22) ఆన్‌లైన్‌లో పార్ట్‌టైం ఉద్యోగాల కోసం వెతికింది. వాట్సప్‌ ద్వారా సంప్రదించిన సైబర్‌ నేరగాళ్లు(Cyber Criminals) ఫ్లిప్‌ కార్ట్‌ ఇంటర్నెట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో గ్లోబల్‌ ఆన్‌లైన్‌ జాబ్‌లు ఉన్నాయని లింక్‌లు పంపారు. ఆమె వివరాలు నమోదు చేసింది.

ఈ వార్తను కూడా చదవండి: CP CV Anand: హనుమాన్‌ విజయోత్సవ ర్యాలీకి 17 వేల మంది పోలీసులతో బందోబస్తు


ఆ తర్వాత జాబ్‌ కావాలంటే రూ.200 రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించాలని కోరగా, వారు సూచించిన ఖాతాకు డబ్బు పంపింది. అనంతరం బాధితురాలి ఖాతాలో రూ.100 జమ చేసిన సైబర్‌ నేరగాళ్లు, ఆన్‌లైన్‌లో జాబ్‌ చేయాలంటే ముందుగా కొంత పెట్టుబడి పెట్టాలని సూచించారు. బాధితురాలితో రూ.1000 పెట్టుబడి పెట్టించి, లాభం అంటూ రూ.250 ఆమె ఖాతాలో జమ చేశారు.


city5.2.jpg

పెద్ద మొత్తంలో పెట్టుబడి పెడితే ఇంకా ఎక్కువ లాభాలు వస్తాయని నమ్మించిన సైబర్‌ నేరగాళ్లు పలు దఫాలుగా రూ.3.56 లక్షలు వసూలు చేశారు. భారీ లాభాలు వచ్చినట్లు యాప్‌లో లాభాలు చూపించారు. కానీ విత్‌డ్రా చేసుకోవాలంటే మరింత పెట్టుబడి పెట్టాలని డిమాండ్‌ చేయడంతో బాధితురాలు సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

Greenfield Expressway: హైదరాబాద్‌-అమరావతి.. గ్రీన్‌ఫీల్డ్‌ హైవే

CM Revanth Reddy: బ్రిటిష్‌ వారి కంటే బీజేపీ నేతలు ప్రమాదకారులు

Hyderabad: ఫోన్‌లో మాట్లాడవద్దన్నందుకు.. ఆ బాలిక ఏం చేసిందో తెలిస్తే..

Read Latest Telangana News and National News

Updated Date - Apr 10 , 2025 | 09:59 AM