Cyber criminals: ఒకటి కాదు.. రెండుకాదు.. రూ.35లక్షలు గోవిందా.. ఏం జరిగిందంటే..
ABN , Publish Date - Aug 06 , 2025 | 07:00 AM
ఆన్‌లైన్ రెంటల్ రెఫరల్ స్కీం పేరుతో సైబర్ మోసగాళ్లు ముషీరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి నుంచి రూ.35 లక్షలను కాజేశారు. ముషీరాబాద్‌కు చెందిన 42 ఏళ్ల వ్యక్తికి కేరళకు చెందిన నిఖిత జీవన్, శివ ప్రకాష్‌లు ఓ వాట్సాప్ సందేశాన్ని పంపారు. రెంట్, స్టడీ లీజ్ పేరుతో ఉన్న వ్యాపార సంస్థ పేరు చెప్పి, అందులో రెఫరల్ జాబ్ వర్క్ ఉంటుందని మంచి లాభాలు, బోనస్ లు ఉంటాయని నమ్మించారు.
- రెంట్.. స్టడీ పేరుతో.. రూ.35లక్షలు స్వాహా
- సైబర్ నేరగాళ్ల మోసం
హైదరాబాద్ సిటీ: ఆన్‌లైన్ రెంటల్ రెఫరల్ స్కీం పేరుతో సైబర్ మోసగాళ్లు ముషీరాబాద్(Musheerabad)కు చెందిన ఓ వ్యక్తి నుంచి రూ.35 లక్షలను కాజేశారు. ముషీరాబాద్‌కు చెందిన 42 ఏళ్ల వ్యక్తికి కేరళకు చెందిన నిఖిత జీవన్, శివ ప్రకాష్‌లు ఓ వాట్సాప్(WhatsApp) సందేశాన్ని పంపారు. రెంట్, స్టడీ లీజ్ పేరుతో ఉన్న వ్యాపార సంస్థ పేరు చెప్పి, అందులో రెఫరల్ జాబ్ వర్క్ ఉంటుందని మంచి లాభాలు, బోనస్ లు ఉంటాయని నమ్మించారు. మొదట రూ.10వేలు పెట్టుబడిగా పెడితే దానికి లాభంగా రూ.10,748లను ఇచ్చారు.

పెట్టుబడి పెంచితే ఎక్కువ లాభాలు వస్తాయని నమ్మించి దశల వారీగా అతని నుంచి రూ.35,26,677లను డిపాజిట్లుగా తీసుకున్నారు. ఆ తర్వాత నుంచి లాభాలు చెల్లించడం మానేశారు. రెఫరల్ పేరుతో ఉన్న వర్క్‌ను ఆపివేయడంతో పాటు అతను చెల్లించిన డబ్బులను తిరిగి ఇవ్వలేదు. దీనిపై బాధితుడు ప్రశ్నిస్తే అదనంగా మరో రూ.12లక్షలు చెల్లించాలని డిమాండు చేశారు. ఇది మోసం అని గ్రహించిన బాధితుడు సిటీ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఆది నుంచీ అక్రమాల ‘సృష్టి’ డాక్టర్ నమ్రత చుట్టూ బిగుస్తున్న ఉచ్చు
Read Latest Telangana News and National News