Cyber criminals: ఇన్సూరెన్స్ రీఫండ్ పేరుతో సైబర్ మోసం.. రూ.5.81 లక్షలకు టోకరా
ABN , Publish Date - Feb 28 , 2025 | 07:03 AM
ఇన్సూరెన్స్ పాలసీ(Insurance policy)కి చెందిన డబ్బులు ఖాతాలో జమ చేస్తామంటూ నమ్మించిన సైబర్ నేరగాళ్లు(Cyber criminals) నగరవాసి నుంచి రూ.5.81 లక్షలు కాజేశారు. సికింద్రాబాద్(Secunderabad)కు చెందిన ప్రైవేటు ఉద్యోగి (58)కి పలు సంస్థల ఇన్సూరెన్స్ పాలసీలు ఉన్నాయి.
- ఇన్సూరెన్స్ రీఫండ్ పేరుతో సైబర్ మోసం
హైదరాబాద్ సిటీ: ఇన్సూరెన్స్ పాలసీ(Insurance policy)కి చెందిన డబ్బులు ఖాతాలో జమ చేస్తామంటూ నమ్మించిన సైబర్ నేరగాళ్లు(Cyber criminals) నగరవాసి నుంచి రూ.5.81 లక్షలు కాజేశారు. సికింద్రాబాద్(Secunderabad)కు చెందిన ప్రైవేటు ఉద్యోగి (58)కి పలు సంస్థల ఇన్సూరెన్స్ పాలసీలు ఉన్నాయి. కొద్ది రోజుల క్రితం ఇంటిగ్రేటెడ్ గ్రీవెన్స్ మేనేజ్‌మెంట్ సిస్టం (ఐజీఎంఎస్)నుంచి ఫోన్ చేస్తున్నామంటూ సైబర్ నేరగాడు ఫోన్ చేశాడు.
ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: హెచ్‌సీయూలో కుప్పకూలిన నిర్మాణం

మీ ఇన్సూరెన్స్ పాలసీకి సంబంధించిన డబ్బు మొత్తం మీ ఖాతాలో జమ చేస్తామని, దానికి సంబంధించి కొంత మొత్తం చెల్లించాలని కోరాడు. అతడి మాటలు నమ్మిన బాధితుడు అతడు సూచించిన ఖాతాలో డబ్బు జమ చేశాడు. తర్వాత పలు ఫీజులు, రీఫండబుల్ మొత్తం అంటూ రూ.5.81 లక్షలు వసూలు చేశారు. ఎంతకీ ఇన్సూరెన్స్ పాలసీ డబ్బులు రాకపోవడంతో బాధితుడు సైబర్ క్రైం ఠాణాలో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ఈవార్తను కూడా చదవండి: ఎస్‌ఎల్‌బీసీ అత్యంత క్లిష్టమైన టన్నెల్
ఈవార్తను కూడా చదవండి: రేవంత్ ప్రభుత్వంలో ఆ స్కీమ్ బాగుంది
ఈవార్తను కూడా చదవండి: తెలంగాణ పర్యటనకు కాంగ్రెస్ అగ్రనేత..
ఈవార్తను కూడా చదవండి: అభివృద్ధి పనులు పెండింగ్ లేకుండా చూడాలి
Read Latest Telangana News and National News