Hyderabad: హెచ్‌సీయూలో కుప్పకూలిన నిర్మాణం
ABN , Publish Date - Feb 28 , 2025 | 06:44 AM
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(Hyderabad Central University)లో నిర్మాణంలో ఉన్న నూతన పరిపాలన భవనం బాల్కనీ స్లాబ్ కుప్పకూలింది. గురువారం రాత్రి సుమారు 8 గంటల సమయంలో జరిగిన ఈ ప్రమాదంలో 9మంది కార్మికులు గాయపడ్డారు.
- పరిపాలన భవనం బాల్కానీ స్లాబ్ నేలమట్టం
- 9మంది కార్మికులకు గాయాలు
హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(Hyderabad Central University)లో నిర్మాణంలో ఉన్న నూతన పరిపాలన భవనం బాల్కనీ స్లాబ్ కుప్పకూలింది. గురువారం రాత్రి సుమారు 8 గంటల సమయంలో జరిగిన ఈ ప్రమాదంలో 9మంది కార్మికులు గాయపడ్డారు. సమాచారం అందుకున్న గచ్చిబౌలి పోలీసులు(Gachibowli Police) హెచ్‌సీయూకి చేరుకుని నేలమట్టమైన స్లాబ్‌లో చిక్కుకున్న కార్మికులను బయటకు తీసి చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
ఈ వార్తను కూడా చదవండి: నిధులను సద్వినియోగం చేసుకోవాలి
హెచ్‌సీయూ నూతన పరిపాలన భవన నిర్మాణాన్ని మరో 8నెలల కాలంలో కాంట్రాక్టర్ పూర్తిచేసి ప్రారంభానికి సిద్ధం చేయాల్సి ఉంది. గురువారం పరిపాలనా భవన బాల్కనీ స్లాబ్‌కు కాంక్రీట్ పనులు నిర్వహించారు. అయితే, కాంక్రీట్ బరువుకు సెంట్రింగ్ సపోర్టు పిల్లర్లు కదలడంతో ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో కార్మికులు సంజయ్, కరణ్, ఈశ్వర్, దేన, యూనస్, మాధవ్, మనోజ్, జలేందర్(Manoj, Jalandhar), భగవాన్‌లపై స్లాబ్ పెళ్లలు పడడంతో అందులో చిక్కుకుని గాయపడ్డారు.

పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వారిని స్లాబ్ పెళ్లల నుంచి బయటకు తీసి చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా శిథిలాల తొలగింపు పనులు జరుగుతున్నాయి, ఇంకా శిథిలాల కింద కార్మికులు ఎవరైనా ఉన్నారా అనే అనుమానాలు వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా, కాంట్రాక్టర్‌పై అధికారులు చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం.
ఘటన బాధాకరం
హెచ్‌సీయూలో నిర్మాణంలో ఉన్న స్లాబ్ కూలిన ఘటన బాధాకరం. కార్మికులు వినియోగిస్తున్న వస్తువుల క్వాలిటీపై విచారణ చేపట్టాలి. అలాగే కాంట్రాక్టర్‌కు ఎలా కాంట్రాక్టు దక్కింది.. బిడ్డింగ్ ఎలా జరిగింది.. తక్కువ ధర పలికిన అతడికే ఈ కాంట్రాక్టు దక్కిందా.. అనే విషయాలు తెలియాల్సి ఉంది. గాయపడిన కార్మికుల కుటుంబాలకు తగిన నష్టపరిహారాన్ని అందించాలి. ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి, వీసీ, రిజిస్ర్టార్, ఇంజనీర్ పాత్రలపై తేల్చాలి.
- అనిల్, ఏబీవీపీ హెచ్‌సీయూ ప్రెసిడెంట్

ఈవార్తను కూడా చదవండి: ఎస్‌ఎల్‌బీసీ అత్యంత క్లిష్టమైన టన్నెల్
ఈవార్తను కూడా చదవండి: రేవంత్ ప్రభుత్వంలో ఆ స్కీమ్ బాగుంది
ఈవార్తను కూడా చదవండి: తెలంగాణ పర్యటనకు కాంగ్రెస్ అగ్రనేత..
ఈవార్తను కూడా చదవండి: అభివృద్ధి పనులు పెండింగ్ లేకుండా చూడాలి
Read Latest Telangana News and National News