Share News

Hyderabad: అమ్మో.. రూ.29.5 లక్షలు దోచేశారుగా.. ఏం జరిగిందో తెలిస్తే..

ABN , Publish Date - Dec 06 , 2025 | 06:47 AM

హైదరాబాద్ నగరం సైబర్ మోసాలకు అడ్డాగా మారిందనే విమర్శలొస్తున్నాయి. ప్రతిరోజూ ఎక్కడో ఓ చోట ఈ మోసాలకు ఎవరో ఒకరు బలవుతూనే ఉన్నారు. తాజాగా ఓ మహిళ రూ.29.5 లక్షలను పోగొట్టుకుంది. ఇందకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

Hyderabad: అమ్మో.. రూ.29.5 లక్షలు దోచేశారుగా.. ఏం జరిగిందో తెలిస్తే..

- నకిలీ ట్రేడింగ్‌ యాప్‌తో బురిడీ

హైదరాబాద్‌ సిటీ: నకిలీ ట్రేడింగ్‌ యాప్‌ సృష్టించిన సైబర్‌ నేరగాళ్లు పెట్టుబడుల పేరుతో బురిడీ కొట్టించి నగరానికి చెందిన వృద్ధుడి నుంచి రూ.29.5లక్షలు కొల్లగొట్టారు. సైబర్‌ క్రైమ్‌ పోలీసుల కథనం ప్రకారం.. నల్లకుంటకు చెందిన 63 ఏళ్ల రిటైర్డ్‌ ఉద్యోగిని దివ్య మెహరా(Divya Mehra) అనే మహిళ ఇండియా వివేష్‌ షేర్స్‌ అండ్‌ సెక్యూరిటీస్‌ లిమిటెడ్‌కు చెందిన 163 గేట్‌వే టుది ఫ్యూచర్‌ వాట్సాప్‌ గ్రూపులో యాడ్‌ చేసింది. ఇందులో పెట్టుబడులు పెడతే.. అత్యధిక లాభాలు వస్తాయని నమ్మించి అతని బ్యాంకు ఖాతా, పాన్‌ వివరాలు తీసుకొని పెట్టుబడులు పెట్టించారు.


city1.2.jpg

చిన్న మొత్తంలో పెట్టుబడులు పెట్టించి అధిక మొత్తంలో లాభాలు వచ్చినట్లు వర్చువల్‌గా చూపించారు. అలా మెల్లగా ఊబిలోకి దింపి రూ. 29.5లక్షలు కొల్లగొట్టారు. రూ.64 లక్షలు లాభాలు వచ్చినట్లు చూపించారు. వాటిని విత్‌డ్రా చేసుకోవాలంటే రూ.5లక్షలు కమీషన్‌ చెల్లించాలని సూచించారు. ఉన్న డబ్బులో డెబిట్‌ చేసుకోవాలని సూచించినా కుదరదని చెప్పారు. ఇదంతా ఏదో మోసంలా ఉందని భావించిన బాధితుడు సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆ యాప్‌ గురించి ఆరా తీయగా అది నకిలీదని తేలింది.


ఈ వార్తలు కూడా చదవండి..

గుడ్ న్యూస్.. వెండి ధరలో భారీ కోత

రూ.100తో వారసత్వ భూముల రిజిస్ర్టేషన్‌

Read Latest Telangana News and National News

Updated Date - Dec 06 , 2025 | 06:47 AM