Cyber fraud: ఏపీకే ఫైల్స్ పంపి సైబర్ మోసం.. రూ.1.43 లక్షలు గోవిందా..
ABN , Publish Date - Jul 17 , 2025 | 07:54 AM
ఏపీకే ఫైల్స్ పంపిన నేరగాళ్లు మొబైల్‌ను హ్యాక్ చేసి వృద్ధుడి ఖాతా నుంచి రూ.1.43 లక్షలు కొల్లగొట్టారు. సిటీ సైబర్ క్రైమ్ పోలీసుల కథనం ప్రకారం.. ఆసిఫ్‌నగర్‌కు చెందిన 56 ఏళ్ల వృద్ధుడు తన వాచ్‌మన్‌కు సూపర్ మనీ యాప్ ద్వారా రూ.1200 పంపారు. ఆ డబ్బు అతడికి అందలేదు.
- వృద్ధుడి నుంచి రూ.1.43 లక్షలు కొట్టేసిన క్రిమినల్స్
హైదరాబాద్ సిటీ: ఏపీకే ఫైల్స్ పంపిన నేరగాళ్లు మొబైల్‌ను హ్యాక్ చేసి వృద్ధుడి ఖాతా నుంచి రూ.1.43 లక్షలు కొల్లగొట్టారు. సిటీ సైబర్ క్రైమ్ పోలీసుల కథనం ప్రకారం.. ఆసిఫ్‌నగర్(Asifnagar)కు చెందిన 56 ఏళ్ల వృద్ధుడు తన వాచ్‌మన్‌కు సూపర్ మనీ యాప్ ద్వారా రూ.1200 పంపారు. ఆ డబ్బు అతడికి అందలేదు. దాంతో బాధితుడు ఆన్‌లైన్‌లో సూపర్ మనీ కస్టమర్ కేర్ నంబర్ కోసం శోధించాడు.

ఓ నంబర్‌కు ఫోన్ చేసి విషయం చెప్పాడు. దాంతో వారు ఒక లింకు పింపిస్తున్నామని చెప్పి మోసపూరితమైన ఏపీకే ఫైల్ లింకును పంపారు. దాన్ని క్లిక్ చేసిన బాధితుడు అందులో తన బ్యాంకు ఖాతాకు సంబంధించిన వివరాలు నమోదు చేశాడు. అప్పటికే ఫోన్ హ్యాక్ చేసిన పోలీసులు బాధితుడి ఖాతా నుంచి రూ.1.43లక్షలు కొట్టేశారు. దీంతో అతడు పోలీసులను ఆశ్రయించాడు.
ఈ వార్తలు కూడా చదవండి.
తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
తాటి చెట్టే లేదు.. లక్షల లీటర్ల కల్లా..
Read Latest Telangana News and National News